గూగుల్‌ పేలో పేమెంట్‌ హిస్టరీ డిలీట్‌ చేయాలా?.. ఇలా చేస్తే సరి!

Mana Enadu: ప్రస్తుతం అందరూ డిజిటల్ పేమెంట్ వైపే మొగ్గు చూపుతున్నారు. రూపాయి చాక్లెట్ నుంచి పది రూపాయల చాయ్ వరకు, కూరగాయల నుంచి దుస్తులు, ఎలక్ట్రానిక్ పరికరాల వరకు అందరూ యూపీఐ యాప్స్ నే పేమెంట్ కోసం వాడుతున్నారు.

అందులోనూ ముఖ్యంగా గూగుల్ పే ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ కూడా గూగుల్ పేలో నమోదవుతున్నాయి. దానివల్ల అందులో హిస్టరీ పెరిగి చాంతాడంతా అవుతోంది. అయితే ట్రాన్సాక్షన్ హిస్టరీ నుంచి మీకు అవసరం లేని వివరాలను డిలీట్ చేయొచ్చని తెలుసా..? అదెలాగంటే..? 

గూగుల్ పే హిస్టరీ ఎలా డిలీట్ చేయాలంటే!

గూగుల్‌ పే యాప్‌లో ప్రొఫైల్‌పై ట్యాప్‌ చేసి ‘Settings’లోకి వెళ్లి ‘Privacy & Security’ ఆప్షన్​పై క్లిక్‌ చేయండి
‘Data & Personalization’ అనే ఆప్షన్‌ను ఎంచుకొని గూగుల్‌ అకౌంట్‌ లింక్‌పై నొక్కండి
తర్వాత ‘Manage your Google pay experience’ పేజ్‌ని కిందకు స్క్రోల్‌ చేస్తే గూగుల్‌ పే లావాదేవీల హిస్టరీ అంతా కనిపిస్తుంది.
ఇప్పుడు ఆ లిస్టులో మీరు అవసరం లేదనుకుని తొలగించాలనుకున్న లావాదేవీని డిలీట్ చేయొచ్చు.
ఇంకా కావాలంటే.. టైమ్‌ ఫ్రేమ్‌ను ఎంచుకొని ఆ డేటా మొత్తాన్నీ తొలగించొచ్చు.
మొత్తం హిస్టరీని కూడా డిలీట్‌ చేసే ఆప్షన్ ఉంది. 

Related Posts

Gold & Silver Price: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు (Gold Rate) భారీగా పెరిగాయి. అంతర్జాతీయ, జియోపాలిటికల్ పరిణామాల నేపథ్యంలో ఈ పెరుగుదల నమోదైంది. ఇండియా-అమెరికా మధ్య టారిఫ్‌ల ప్రభావం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, డాలర్‌(Dollar) క్షీణత వంటి కారణాలతో అంతర్జాతీయంగా పసిడి, వెండి ధరల (Gold…

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. కేజీ వెండి రేటెంతంటే?

బంగారం ధరలు(Gold Rates) రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌(Hyderabad Bullion Market)లో ఈ రోజు (ఆగస్టు 29) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710 పెరిగి రూ.1,03,310కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *