రాహుల్​ గాంధీ తెలంగాణ నుంచే పోటీ

తెలంగాణలో బలాన్ని కాంగ్రెస్​ మరింతగా పెంచుకునేందుకు అడుగులు వేస్తోంది. పార్టీ అగ్రనేతలను తెలంగాణ నుంచి పోటీ చేయించడానికి సిద్ధం అయింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఎర్పాటు చేసిన కాంగ్రెస్ రానున్న లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలను రాబట్టుకునేలా వ్యూహం వేస్తోంది.

రాష్ట్రం నుంచి పార్టీ అధినేతలను రంగంలో దింపాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే రాహుల్‌ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే.. ఇక్కడ పార్టీ మరింత ప్రభావం చూపుతుందని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి.

లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఈసారి కేరళకు గుడ్ బై చెప్పవచ్చు. కేరళలో రాహుల్ గాంధీ వయనాడ్ సీటుతో పాటు శశి థరూర్ తిరువనంతపురం సీటు నుంచి ఎల్డీఎఫ్ అభ్యర్థులను ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ఈసారి వాయనాడ్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయకూడదని భావిస్తున్నారు. అయితే రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని గతంలో వచ్చాయి. రాహుల్ గాంధీ ఈసారి తెలంగాణతో పాటు యూపీలోని రాయ్‌బరేలీ లేదా అమేథీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయవచ్చని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అమేథీలో స్మృతి ఇరానీపై పోటీ చేసే అంశంపై రాహుల్ గాంధీ కూడా ఏమీ మాట్లాడలేదు. మరోవైపు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాహుల్ అమేథీపై అంతగా ఆసక్తి చూపలేదు. అదే సమయంలో వరుణ్ గాంధీ కూడా ఇక్కడి నుంచి పోటీ చేయవచ్చనే చర్చ కూడా సాగుతోంది.

ఖమ్మం, నల్గొండ పార్లమెంటు స్థానాల నుంచి రాహుల్​ గాంధీ పోటీలోకి దించడానికి రాష్ట్ర కాంగ్రెస్​ పెద్దలు ఆలోచనలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని రాహుల్​ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కూడా తెలంగాణ నుంచి బరిలోకి దిగడానికి సానుకూలంగా ఉన్న విషయాన్ని స్పష్టం చేసినట్లు సమాచారం. వీటితోపాటు తెలంగాణలో జరిగిన రాహుల్​ జోడో యాత్ర యువకులు చూపించిన అభిమానం పార్టీ అభివృద్ధికి రెండింతలు రెట్టింపు ఉత్సాహం అవుతుందనే అభిప్రాయంతో పెద్దలు ఉన్నారు.

సోనియా లేదా రాహుల్‌ తెలంగాణ నుంచి పోటీ చేస్తే పార్టీకి మరింత మంచి ఫలితాలు వస్తాయంటూ టీపీసీసీ నేతలు చెప్తూ వస్తున్నారు. సోనియా పోటీ చేయాలని తీర్మానం కూడా చేశారు. అయితే.. ఆమె పెద్దల సభకు వెళ్లడంతో రాహుల్ గాంధీని పోటీ చేయించాలని చూస్తోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సహా మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. అంతా రాహుల్‌గాంధీ రావాలనే కోరుతున్నారు.

మరోవైపు, కర్నాటక నుంచి కూడా ఇలాంటి ప్రతిపాదనే వస్తోంది. ఢిల్లీ పెద్దలు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై త్వరలో స్పష్టత రానుంది. అటు.. రెండో చోట పోటీ చేయాలని భావిస్తే.. మళ్లీ అమేథీ నుంచి బరిలో ఉండే ఛాన్స్‌ ఉందంటున్నారు.

Share post:

Popular