PAK Vs BAN: పాక్‌పై క్లీన్‌స్వీప్.. టెస్టుల్లో హిస్టరీ క్రియేట్ చేసిన బంగ్లాదేశ్

Mana Enadu: టీమ్ ఇండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌(Pakistan) జట్టుకు ఘోర అవమానం ఎదురైంది. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌(Bangladesh)తో జరిగిన రెండో టెస్టులోనూ చెత్త ప్రదర్శన చేసింది. దీంతో తొలిసారి ఆ జట్టు బంగ్లాదేశ్‌ టీమ్‌పై వైట్ వాష్‌(White Wash)కు గురైంది. అన్ని విభాగాల్లో సత్తా చాటిన బంగ్లా పాక్‌ను మట్టికరిపించి తొలిసారి పాకిస్ఠాన్‌పై టెస్ట్ సిరీస్‌(Test Series)ను కైవసం చేసుకుంది. రావల్పిండి వేదికగా జరిగిన రెండో టెస్టు(Second Test)లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను బంగ్లా 2-0 తేడాతో కైవసం చేసుకుంది.

 బంగ్లా బౌలర్ల ధాటికి పాక్ కుదేల్

రెండో టెస్టులో టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్.. పాక్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆ జట్టు బ్యాటర్లలో ఓపెనర్ అయూబ్ 58, మసూద్ 58, ఆజామ్ 31, సల్మాన్ 54 మినహా మిగతా వారంతా బంగ్లా బౌలర్ల ధాటికి చేతులెత్తేయడంతో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 1st Innings ఆరంభించిన బంగ్లా వికెట్ కీపర్ లిట్టన్ దాస్ 138, మెహదీ హసన్ 78 రన్స్ చేయడంతో 262 పరుగులకు ఆలౌటై 12 పరుగులు వెనకబడింది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ బౌలర్ల విజృంభణతో పాకిస్థాన్ 172 పరుగులకే నాలుగో రోజు ఆలౌటైపోయింది. ముందున్న 185 పరుగుల లక్ష్య ఛేదనలో జాకీర్ 40, ఇస్లాం 24, శాంటో 38, మోమినుల్ 34 రన్స్ చేసి ఔటయ్యారు. అనంతరం సీనియర్ ప్లేయర్లు ముష్ఫికర్ రహీం (22 నాటౌట్), షకీబల్ హసన్ (21 నాటౌట్) స్లోగా ఆడుతూ రన్స్ రాబట్టారు. మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్త పడ్డారు. అలవోకగా జట్టును గెలుపు తీరం దాటించారు. 6 వికెట్ల తేడాతో బంగ్లా విజయం సాధించింది. ఈ చరిత్రాక్మత(History) గెలుపు తర్వాత బంగ్లాదేశ్ ఆటగాళ్లు సంబరాలు(Celebrations) చేసుకున్నారు.

తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో..

ఈ సిరీస్ కైవసం చేసుకొని బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. పాకిస్థాన్‍పై తొలిసారి టెస్టు సిరీస్ గెలిచి ఆ జట్టు హిస్టరీ క్రియేట్ చేసింది. పాక్ గడ్డపై బంగ్లా గర్జించింది. రావల్పిండి(Ravlpindi)లోనే జరిగిన తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో గెలిచి బంగ్లా అదరగొట్టింది. రెండో టెస్టులోనూ గెలిచి 2-0తో సిరీస్‍లో పాకిస్థాన్‍ను వైట్‍వాష్ చేసింది. గత 1303 రోజుల్లో సొంతగడ్డపై పాకిస్థాన్ ఒక్క టెస్టు మ్యాచ్ కూడా గెలువలేకపోయింది. ఐసీసీ టోర్నీల్లోనూ ఆ జట్టుకు పరాభవాలే ఎదురవుతున్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ చేతిలో ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది కంగుతింది పాకిస్థాన్ జట్టు. దీంతో ఆ టీమ్‌పై ఆ దేశ అభిమానులు పెద్దయెత్తున విమర్శలు కురిపిస్తున్నారు. సొంతగడ్డ(Home soil )పై బంగ్లా లాంటి జట్టును కూడా ఓడించలేకపోయారని మండిపడుతున్నారు.

 

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *