Paris Olympics : చిన్నోడిపైనా వేటు పడేదా?.. 10 గంటల్లో 4.6 కేజీలు తగ్గిన అమన్‌ సెహ్రావత్‌

Mana Enadu:పారిస్ ఒలింపిక్స్‌లో భారత్​కు ఆరో పతకాన్ని అందించాడు రెజ్లర్ అమన్‌ సెహ్రావత్‌. 21 ఏళ్ల అండర్‌-23 ప్రపంచ ఛాంపియన్‌ అమన్‌ సెహ్రావత్‌ శుక్రవారం రోజున జరిగిన 57 కిలోల పోరులో 13-5తో దరియన్‌ టోయ్‌ క్రజ్‌ (ప్యూర్టోరికో) ను ఓడించాడు. ఒలింపిక్స్‌ బరిలో భారత్​ తరఫున బరిలోకి దిగిన ఏకైక మేల్ ప్లేయర్​ అయిన అమన్​ ఈ ఒలింపిక్స్​లో వ్యక్తిగత పతకం సాధించిన అతి పిన్న వయస్సు గల భారత అథ్లెట్‌గా రికార్డుకెక్కాడు అమన్​కంటే ముందే ఈ రికార్డు బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ఖాతాలో ఉండేది. 2016లో జరిగిన ఒలింపిక్స్​లో ఆమె రజతం గెలిచినప్పుడు తన వయసు 21 ఏళ్ల 1 నెల 14 రోజులు.

అయితే అమన్ సహ్రావత్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఇటీవలే 100 గ్రాములు అధిక బరువు ఉండటంతో భారత స్టార్ రెజ్లర్ ఫైనల్​లో అనర్హత వేటు పడి పోటీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే అమన్ విషయంలో కూడా అలా జరిగే ఆస్కారం ఉండటంతో మేనేజ్​మెంట్ ముందుగా జాగ్రత్త పడిందట. సెమీస్‌లో ఓటమి తర్వాత గత గురువారం నాడు అమన్‌ బరువు 61.5 కేజీలు ఉండటంతో కాంస్య పోరు (శుక్రవారం రాత్రి) నాటికి 57 కేజీలకు వచ్చేందుకు చాలా కష్టపడ్డాడట అమన్. కేవలం 10 గంటల వ్యవధిలో ఏకంగా 4.6 కేజీలు తగ్గాడట.

గురువారం రాత్రి 6.30 గంటలకు అమన్‌ సెమీస్‌లో తలపడి ఓడిపోవడంతో కాంస్య పోరులో తలపడే అవకాశం మాత్రమే ఉంది. అందుకోసం శుక్రవారం ఉదయం అమన్‌ బరువును కొలవగా 61.5 కేజీలు ఉన్నాడట. గేమ్​కు సరిగ్గా 10 గంటల సమయం మాత్రమే ఉండటంతో సీనియర్‌ కోచ్‌లు జగమందర్ సింగ్, వీరేందర్ దహియాతోపాటు మరో ఆరుగురి బృందం అమన్‌ను గంటపాటు వేడినీళ్ల స్నానం, ఆగకుండా గంటసేపు ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్‌, ఆ తర్వాత జిమ్​లో కసరత్తులు, ఐదు సెషన్లపాటు ఐదేసి నిమిషాల చొప్పున సానా బాత్‌ చేయించారట. చివరి సెషన్‌ నాటికి 900 గ్రాములు అధిక బరువు ఉన్నట్లు కోచ్‌లు గుర్తించి నెమ్మదిగా జాగింగ్‌ చేయమని అమన్‌కు సూచించారట. అలా శుక్రవారం ఉదయం 4.30 గంటలకు అమన్‌ 56.9 కేజీలకు చేరాడట. తాను పోటీ పడిన వెయింట్‌ (57కేజీలు) కంటే వంద గ్రాములు తక్కువే ఉన్నాడు. దాంతో భారత బృందం ఊపిరి పీల్చుకుంది. 

 

Related Posts

Alaska Meeting: ముగిసిన ట్రంప్-పుతిన్ భేటీ.. ఉక్రెయిన్‌తో వార్‌పై చర్చలు నిల్!

ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూసిన ఇద్దరు అగ్రనేతల భేటీ ముగిసింది. అలాస్కా(Alaska) వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump), రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Vladimir Putin) సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య దాదాపు 2.30 గంటలకు పైనే చర్చలు జరిగాయి. అయితే…

ప్రభుత్వం బంపరాఫర్.. ప్రతి బిడ్డకు ఏడాదికి రూ.45 వేలు.. ఈ ఆఫర్ మిస్ కావద్దు

ప్రపంచంలో జనాభా వేల కోట్లకు చేరుతున్న తరుణంలో, కొన్ని దేశాలు మాత్రం జనాభా తగ్గిపోతుండటంతో తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా(China) దేశం ఒకప్పుడు అధిక జనాభాతో వెలవెలబోయిన ఈ దేశం ఇప్పుడు పిల్లల(Child) జననం తక్కువగా ఉండటంతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *