SKY: నా ఏమ్ అదే.. రెడ్‌బాల్ క్రికెట్‌పై సూర్యకుమార్ కామెంట్స్

Mana Enadu: SKY.. అదేనండీ సూర్యకుమార్ యాదవ్(Suryakumar yadav). అభిమానులు ముద్దుగా స్కై అని పిలుచుకుంటారు. ఈ టీమ్ఇండియా(TeamIndia) హిట్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విధ్వంసకర హిట్టింగ్‍కు కేరాఫ్ అడ్రస్‍. తన విభిన్నమైన షాట్లతో ధనాధన్ ఆట ఆడతాడు సూర్యకుమార్ యాదవ్. అతడు క్రీజులో ఉంటే బంతి ఎక్కడ పడింది.. ఎంత స్పీడులో వస్తుందనేది చూడడు. తన గేమ్.. తన ఏమ్ ఒక్కటే బంతి బౌండరీ వెళ్లిందా? లేదా? ముఖ్యంగా T20 Cricketలో సూర్యకుమార్ ఆట గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే ఈ ఫార్మాట్లో చాలా కాలం పాటు అతడు ప్రపంచ నంబర్ (ప్రస్తుతం 2వ ర్యాంక్) ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అయితే ఇటీవల భారత టీ20 జట్టుకు కెప్టెన్సీ బాధ్యత వచ్చాక సూర్యలో దూకుడు తగ్గుతుందని ఫ్యాన్స్‌లో కొంత సందేహం ఉండేది. కానీ వాటన్నింటినీ స్కై కొట్టిపారేశాడు. తాను కెప్టెన్‍ను అయినా తన దూకుడైన స్టైల్‍లో ఏ మాత్రం మార్పు ఉండదని చెప్పేశాడు.

ఒకే ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు

అయితే వైట్ బాల్ క్రికెట్(White ball Cricket) వరకూ సూర్య ఓ అటాకింగ్ ప్లేయర్. కానీ టెస్టు జట్టులో మాత్రం అతడికి ప్లేసే ఉండదు. ఈ నేపథ్యంలో టెస్టు ఫార్మాట్‌ సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన మొదటి ప్రాధాన్యత టెస్టు క్రికెట్ అని పేర్కొన్నాడు. భారత టెస్టు జట్టులో తిరిగి చోటు దక్కించుకోవడానికి ప్రయత్నిస్తానని తెలిపాడు. 2021లో అంతర్జాతీయ క్రికెట్‌(Internatinal Cricket)లో అరంగేట్రం చేసిన సూర్య ప్రస్తుతం టీ20 జట్టుకు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే. టీ20ల్లో చెలరేగే ఈ విధ్వంసకర బ్యాటర్ వన్డేల్లో నిరాశపరచడంతో ఆ ఫార్మాట్‌లోనూ జట్టులో చోటు కోల్పోయాడు. ఇక 33 ఏళ్ల ఈ హిట్టర్ ఒకే ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు. 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత నుంచి టెస్టులు ఆడలేదు. ఈ నేపథ్యంలోనే తాను దేశవాళీ టోర్నీల్లో సత్తాచాటి తిరిగి భారత టెస్టు జట్టులో స్థానం దక్కించుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశాడు స్కై.

 నా ప్రస్తుత దృష్టి అంతా దానిపైనే..

‘టెస్టు జట్టులో స్థానం దక్కించుకోవడానికి ఎంతో మంది ఆటగాళ్లు తీవ్రంగా కష్టపడుతున్నారు. నేను కూడా టెస్టు జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నాను. అయితే భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన తర్వాత నాకు గాయమైంది. అనంతరం అవకాశాలు వచ్చిన ఆటగాళ్లు సత్తాచాటి రాణిస్తున్నారు. ఇప్పుడు అవకాశాలు రావడానికి వాళ్లే అర్హులు. ఇక నా ప్రస్తుత దృష్టి అంతా.. బుచ్చిబాబు టోర్నమెంట్(Bucchibabu Tournment), దులీప్ ట్రోఫీ(Duleep Trophy) ఆడటమే. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం’ అని సూర్యకుమార్ పేర్కొన్నాడు. ప్రస్తుతం సూర్య బుచ్చిబాబు టోర్నమెంట్‌లో ముంబై తరఫున ఆడుతున్నాడు. ముంబై జట్టులో సూర్యతో పాటు శ్రేయస్ అయ్యర్(Shreyas Ayyar), సర్ఫరాజ్ ఖాన్(Sarfraj Khan) వంటి స్టార్ ఆటగాళ్లు కూడా ఉన్నారు.

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *