Mana Enadu:అభిమానులకు టీమ్ ఇండియా క్రికెటర్ రిషభ్ పంత్(Rishabh Pant) అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. ప్రస్తుతం పారిస్(paris)లో జరుగుతున్న ఒలింపిక్స్(olympics)లో గోల్డెన్ బాయ్, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా(neeraj chopra) గురువారం జరిగే ఫైనల్లో గోల్డ్ మెడల్ గెలిస్తే అభిమానుల్లో ఒకరికి రూ.1,00,089 బహుమతిగా ఇస్తానని తెలిపాడు.
మన సోదరుడికి మద్దతిద్దాం..
ఈ మేరకు ట్విటర్ (X)లో ఓ స్పెషల్ ట్వీట్(special tweet) పోస్ట్ చేశాడు. తన ట్వీట్‌ను లైక్ చేసి, అత్యధికంగా కామెంట్ చేసిన వారిని సెలక్ట్ చేసి ఆ గిఫ్ట్ మనీ అందిస్తానని ప్రకటించాడు. అలాగే అత్యధికంగా కామెంట్స్ చేసినవారిలో తొలి 10 మందికి విమాన టికెట్లు ఇస్తానని ఆఫర్ చేశాడు. ఈ సందర్భంగా ‘భారత్‌తో పాటు దేశం బయటి నుంచి కూడా నా సోదరుడికి మద్దతు కూడగడదాం’ అని పంత్ పిలుపునిచ్చాడు.

చోప్రానే టాప్
ఇప్పుడీ ట్వీట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. మంగళవారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో నీరజ్ చోప్రా అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. తన తొలి ప్రయత్నంలోనే ఆయన ఈటెను ఏకంగా 89.34 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఫైనల్‌కు అర్హత సాధించిన వారిలో చోప్రానే టాప్. ఆ తర్వాత వరుసగా కెనడాకు చెందిన ఆండర్సన్ పీటర్స్ (88.63మీ), జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ (87.76మీ), పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ ( 86.59 మీ) ఉన్నారు. కాగా 2021 టోక్యో ఒలింపిక్స్‌లోనూ నీరజ్ చోప్రా ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే.

చావు అంచుల నుంచి వచ్చి..
మరోవైపు టీమ్ ఇండియా(team india) క్రికెటర్ 2022 డిసెంబర్‌లో యాక్సిడెంట్‌కు గురైన విషయం తెలిసిందే. ఢిల్లీ(delhi)నుంచి ఝార్ఖండ్‌లోని తన స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో పంతే డ్రైవింగ్ చేస్తున్నాడు. నిద్రమత్తులో జరిగిన ప్రమాదంలో కారు మొత్తం మంటల్లో కాలిపోయి బూడిదైంది. అదృష్టం కొద్దీ కారు నుంచి బయటపడిన పంత్ ప్రాణాలు కాపాడుకున్నాడు. లేకుంటే.. అదే కారులో కాలి బూడిదయ్యేవాడు. ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత.. చికిత్స తీసుకున్న పంత్.. కాలికి తీవ్ర గాయం కావడంతో క్రికెట్‌కు చాలా కాలం దూరమయ్యాడు. దాదాపు రెండేళ్ల తర్వాత 2024 ఐపీఎల్(ipl-2024)ద్వారా మళ్లీ మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు పంత్. అంతేకాదు అంతపెద్ద ప్రమాదంలో గాయపడి కోలుకున్నా.. మునుపటిలాగనే వికెట్ కీపింగ్, బ్యాటింగ్‌లో రెచ్చిపోతున్నాడు. అటు ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గానూ ఆకట్టుకున్నాడు.







