PARALYMPICS 2024 : పారిస్‌లో కొత్త చరిత్ర.. పారాలింపిక్స్​లో భారత్​కు 24 పతకాలు

ManaEnadu:పారిస్‌ వేదికగా పారాలింపిక్స్ (Paris Paralympics 2024)​ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ గేమ్స్​లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఆగస్టు 28న ప్రారంభమైన ఈ క్రీడలు సెప్టెంబరు 8వ తేదీ వరకు జరగనున్నాయి. టోక్యో పారాలింపిక్స్​లో 19 పతకాలు సాధించిన మన పారా అథ్లెట్లు(Indian Para Athletes) ఈసారి 25 పతకాలు సాధించాలన్ని లక్ష్యాన్ని నిర్దేశించుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ అంచనాలను మించిపోయారు.

24 పతకాలతో సరికొత్త రికార్డు

కేవలం 5 రోజుల వ్యవధిలోనే 5 స్వర్ణాలు (Gold Medals) సహా భారత్ ఖాతాలో ఏకంగా 24 పతకాలు తీసుకొచ్చారు. బుధవారం జరిగిన వివిధ ఈవెంట్స్​లో సత్తాచాటి లక్ష్యాన్ని చేరుకునేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచారు. మరో మూడ్రోజులు ఇంకా ఆడాల్సిన క్రీడలు ఉండటంతో ఈసారి 25 పతకాలు పక్కా అని క్రీడా నిపుణులు అంటున్నారు. అంతకుమించి సాధించినా ఆశ్చర్యపడనక్కర్లేదని చెబుతున్నారు. ప్రస్తుతం భారత్‌ 5 స్వర్ణాలు, 9 రజతాలు, 10 కాంస్యాలు కలిపి మొత్తంగా 24 పతకాలు సాధించి పట్టికలో 13వ స్థానంలో ఉంది.

అయితే షూటింగ్‌ (Shooting) 50 మీటర్ల పిస్టల్‌ SH-1 విభాగంలో పతకాలు సాధిస్తారని భారీ అంచనాలు పెట్టుకున్న నిహాల్‌ సింగ్, రుద్రాంశ్‌లకు నిరాశ పరిచారు. 522 స్కోర్‌తో నిహాల్‌ 19వ స్థానంలో పరిమితమవ్వగా, 517 స్కోర్‌తో రుద్రాంశ్‌ 22వ స్థానంలో నిలిచాడు. ఇక సైక్లింగ్‌ (Cycling)లో అర్షద్‌ షేక్‌ 11వ, జ్యోతి గదారియా 16వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.

పారాలింపిక్స్‌లో ఇవాళ్టి భారత్ గేమ్స్ షెడ్యూల్

షూటింగ్‌: మిక్స్‌డ్‌ 50మీ.రైఫిల్‌ ప్రోన్‌  ఎస్‌హెచ్‌1 క్వాలిఫికేషన్‌ (సిద్ధార్థ, మోనా)- మధ్యాహ్నం 1, ఫైనల్‌- మధ్యాహ్నం 3.15

పారా ఆర్చరీ (Para Archery): మిక్స్‌డ్‌ టీమ్‌ రికర్వ్‌ ఓపెన్‌ ప్రిక్వార్టర్స్‌ (పూజ-హర్విందర్‌)- మధ్యాహ్నం  1.50, పతక రౌండ్లు- రాత్రి 8.45 నుంచి

పారా జూడో: మహిళల 48 కేజీ జే2 క్వార్టర్స్‌ (కోకిల×నాట్బెక్‌); పురుషుల 60 కేజీ జే1 క్వార్టర్స్‌ (కపిల్‌×బ్లాంకో)- మ।। 1.30 నుంచి

పారా పవర్‌లిఫ్టింగ్‌ (Para Power Lifting): పురుషుల 65 కేజీల ఫైనల్‌ (అశోక్‌)- రాత్రి 10.05

Share post:

లేటెస్ట్