Jasprit Bumrah: బుమ్రాకు క్రేజీ క్వశ్చన్.. తెలివిగా ఆన్స‌ర్ చేసిన స్పీడ్‌గన్

Mana Enadu: జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)… భారత క్రికెట్లోనే కాదు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు ఈ పేరు తెలియని వారండరు. తన పదునైన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతెప్పలు పెడుతుంటాడు. తన స్వింగ్ బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టిస్తుంటాడు. పేస్, స్లో బాల్స్, బౌన్సర్స్, ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్ ఇలా బుమ్రా చేతినుంచి ఒక్కో సమయంలో ఒక్కో బంతి.. ప్రతిదీ ఆణిముత్యమే. అరవీర భయకరమైన బ్యాట్స్‌మెన్ సైతం బుమ్రా బౌలింగ్‌లో ఆచితూచి ఆడుతుంటారు. అందుకే ఈ స్పీడ్ గన్‌ను భారత క్రికెట్లోనే అత్యంత ప్రమాదకర బౌలర్‌గా అభివర్ణిస్తుంటారు మాజీ ప్లేయర్లు, క్రికెట్ పండితులు. భారత్ T20 World Cup-2024 గెలవడంలో బుమ్రాది కీలక పాత్ర. ఆ తర్వాత భారత్ శ్రీలంక(Srilanka Vs India) టూర్‌కు వెళ్లినా సెలక్టర్లు ఈ పేస్ స్టార్‌కు విశ్రాంతినిచ్చారు. ప్రస్తుతం బుమ్రా ఈ ఖాళీ సమయంలో ఫ్యామిలీ కలిసి పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ నెల బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనున్న టెస్ట్‌ సిరీస్‌(Tests)లో బుమ్రా ఎంటీ ఇవ్వనున్నాడు.

 బుమ్రాకు విద్యార్థుల ప్రశ్నలు

ఇదిలా ఉండగా బుమ్రా తాజాగా తమిళనాడులోని సత్యభామ వర్సిటీ(Satyabama University)కి వెళ్లాడు. అక్కడ బుమ్రాకి విద్యార్థులు పలు ప్రశ్నలు సంధించారు. అందులో ఓ ప్రశ్నకు బుమ్రా చాలా తెలివిగా సమాధానం చెప్పారు. ఇంతకీ ప్రశ్నేంటంటే.. ‘కెరీర్‌లో మీరు బౌలింగ్ చేసిన టఫెస్ట్ బ్యాటర్ ఎవరు(Toughest Batter To Bowl To)?’ అని ప్రశ్నించగా.. జస్‌ప్రీత్ బుమ్రా చాలా తెలివిగా ఎవరూ ఊహించని సమాధానం చెప్పాడు. సాధారణంగా ఇప్పటి వరకు బౌలర్లు ఇలాంటి ప్రశ్న ఎదురైతే బ్యాటర్ల పేర్లు చెప్తుంటారు. కానీ జస్‌ప్రీత్ బుమ్రా మాత్రం ఏ బ్యాటర్ పేరు చెప్పలేదు.

ఆధిపత్యం చెలాయించకుండా..

‘నేను బౌలింగ్ చేసేటప్పుడు తొలుత ఏ బ్యాటర్ (Batsman) కూడా నాపై ఆధిపత్యం చెలాయించకుండా జాగ్రత్తపడతా. అందుకు తగినట్లుగా నేను ప్రిపేర్ అవుతా.. నా మైండ్‌ను కూడా ప్రిపేర్ చేసుకుంటా. నా సామర్థ్యాన్ని నమ్మి నా పని నేను చేస్తాను. అలా అని బ్యాటర్లను తక్కువ చేయడం కాదు. నేను బౌలింగ్ చేసే ప్రతి బ్యాటర్‌నీ గౌరవిస్తా. కానీ మన పని మనం కరెక్ట్ చేస్తే ప్రపంచంలో మనల్ని ఎవరూ ఆపలేరు. అదొక్కటే నేను మననం చేసుకుంటా’ అని జస్‌ప్రీత్ వెల్లడించాడు. కాగా ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో ఏకంగా 15 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా(SA)తో జరిగిన మ్యాచ్‌ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. దాంతో బుమ్రాకి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు కూడా దక్కింది.

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *