Paralympics 2024: 4,400 మంది పారా అథ్లెట్లు.. 549 పతకాల కోసం వేట

Mana Enadu: మరో క్రీడా సంబరానికి సమయం ఆసన్నమైంది. క్రీడా ప్రపంచానికి స్ఫూర్తిని చాటేలా.. అథ్లెట్ల అద్భుత ప్రదర్శనతో అందరికీ తమవైపు తిప్పుకునేలా పారిస్‌లో మరో విశ్వ క్రీడలు షురూ అయ్యాయి. పారిస్ వేదికగా Paralympics Games 2024 అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మిలమిల మెరిసే విద్యుత్ కాంతుల్లో ప్లేయర్లు నిర్వహించిన పరేడ్ నభూతో న:భవిష్యత్ అనిపించాయి. అథ్లెట్ల పరేడ్‌తో అధికారులు పారాలింపిక్స్ ప్రారంభమైనట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేశారు. దాదాపు 4 వేల మందికి పైగా అథ్లెట్లు 20 క్రీడా విభాగాల్లో పన్నెండు రోజుల పాటు తలపడనున్నారు. ఈ సారి పక్కా 25 మెడల్సే లక్ష్యంగా భారత్(India) బరిలోకి దిగుతోంది. మరోవైపు భారత్ బృందాపిరి జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్, షాట్ పుటర్ భాగ్యశ్రీ పతాకధారులుగా వ్యవహరించారు. వీరిద్దరూ మువ్వన్నెల జెండాతో ముందు నడవగా.. మిగతా అథ్లెట్లు వారిని అనుసరించారు.

పారాలింపిక్స్‌కు రంగం సిద్దమయింది. మరికొన్ని గంటల్లోనే ఫ్రాన్స్(France) రాజధాని పారిస్(Paris) వేదికగా ఈ క్రీడలు ప్రారంభం కానున్నాయి. మొన్నటి వరకు జరిగిన సమ్మర్ ఒలింపిక్స్‌(Summer Olympics) క్రీడలను ఘనంగా నిర్వహించి ప్రపంచదృష్టిని ఆకర్షించిన పారిస్‌ ఇప్పుడు మరోసారి అలరించేందుకు సిద్ధమవుతోంది. వివిధ దేశాల నుంచి మొత్తం 4,400 మంది పారా అథ్లెట్లు 549 పతకాల కోసం పోటీపడనున్నారు.ఇక భారత్‌ విషయానికొస్తే ఒలింపిక్స్ చరిత్రలోనే ఈసారి 84 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు.2020 టోక్యో పారాలింపిక్స్‌లో ఐదు స్వర్ణాలు సహా 19 పతకాలు కొల్లగొట్టిన మన అథ్లెట్లు ఈసారి అంతకుమించి పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్నవి 17వ పారాలింపిక్స్ కాగా 1960లో మొదటిసారి ఈ గేమ్స్‌ను నిర్వహించారు. ఇదిలా ఉండగా గురువారం మధ్యాహ్నం 2 గంటలకు భారత్ బ్యాడ్మింటన్‌తో తన పోరు ప్రారంభించింది.

కాగా పారిస్‌ పారాలింపిక్స్‌లో ఈసారి కచ్చితంగా పతకం సాధిస్తారన్న వారిలో తెలంగాణ యువ అథ్లెట్‌ జివాంజీ దీప్తి, మరియప్పన్‌ తంగవేలు,డిస్కస్‌త్రో ప్లేయర్ యోగేశ్‌ కథునియా,ఆర్చరీ-కాంపౌండ్‌ నుంచి శీతల్‌దేవి, కృష్ణనాగర్‌, సుహాస్‌ యతిరాజ్‌(Badminton), భవీనాబెన్‌ పటేల్‌(Table Tennis) ముందున్నారు. ఈ వేడుకలు భారత కాలమాన ప్రకారం ఆగస్టు 28న రాత్రి 11:30 గంటలకు ప్రారంభం అయ్యాయి. కాగా ఈ ఆరంభ వేడుకల్లో దివ్యాంగ కళాకారులు చేసిన ప్రదర్శన అబ్బురపరిచింది. దివ్యాంగ కళాకారులూ తమ ప్రతిభను చాటి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. గ్యాలరీలన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి.. గాల్లోనూ సాగిన అనేక విన్యాసాలు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాయి. హాలీవుడ్‌ స్టార్‌ జాకీచాన్‌ క్రీడా జ్యోతిని చేబూని పారిస్‌ వీధుల్లో సందడి చేశాడు.

Share post:

లేటెస్ట్