పారిస్​ పారాలింపిక్స్‌ 2024 .. నేటి భారత్‌ షెడ్యూల్‌ ఇదే

ManaEnadu:ప్రేమ నగరం పారిస్‌ (Paris) మరోసారి క్రీడా సంబురాలతో వెలుగులీనింది. మరో ప్రపంచ క్రీడా సంబురానికి ఈ నగరం వేదికగా మారింది. పారిస్​లో బుధవారం రోజున పారాలింపిక్స్‌ 2024 క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గ్యాలరీలన్నీ క్రీడాభిమానులతో నిండిపోయి సందడిగా మారాయి. ఆకట్టుకునే కళా ప్రదర్శనలు, అబ్బురపరిచే విన్యాసాలతో వేడుక గ్రాండ్​గా జరిగింది. ఫ్రాన్స్‌ జెండాలోని మూడు రంగుల్ని 8 విమానాల ద్వారా విడుదల చేస్తూ ఆకాశంలో చేసిన ఎయిర్‌ షో వీక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఇవాళ్టి నుంచి క్రీడలు (Paris Paralympics 2024) ఘనంగా ప్రారంభం కానున్నాయి. మరి పారిస్ పారా ఒలింపిక్స్​లో ఈ రోజు(ఆగస్ట్ 29) భారత అథ్లెట్లు(Indian Athletes) ఏయే క్రీడల్లో పాల్గొననున్నారంటే..?

పారిస్ పారాలింపిక్స్ ఇవాళ్టి షెడ్యూల్..

బ్యాడ్మింటన్ (Badminton Paralympics)
మిక్స్‌డ్‌ డబుల్స్‌: మధ్యాహ్నం 12.40 గంటలకు నితేశ్ కుమార్-తులసిమతి మురుగేసన్, సుహాస్‌ యతిరాజ్-పాలక్ కోహ్లి
మిక్స్‌డ్ డబుల్స్‌: మధ్యాహ్నం 12.40 గంటలకు శివరాజన్‌ సోలైమలై – నిత్య శ్రీ శివన్ జోడీ, అమెరికాకు చెందిన క్రెజెస్కి – జేసీ సిమోన్
మెన్స్‌ సింగిల్స్‌: మధ్యాహ్నం 2 గంటలకు నితేశ్‌ కుమార్ వర్సెస్ మనోజ్ సర్కార్, మధ్యాహ్నం 3.40 గంటలకు హిక్మత్ రామ్‌దానితో సుహాస్ యతిరాజ్
ఉమెన్స్‌ సింగిల్స్‌: మధ్యాహ్నం 2 గంటలకు సైకురోహ్‌-మానసి జోషి, మన్‌దీప్‌ కౌర్-మరియమ్, సుకంత్ కదమ్-అమిన్‌ (ఉమెన్స్‌)
ఆర్చరీ ర్యాంకింగ్‌ రౌండ్స్‌: మధ్యాహ్నం 12.30గంటల నుంచి హర్విందర్ సింగ్‌, సరిత, సీతల్‌ దేవి
తైక్వాడో: మధ్యాహ్నం 2.30 గంటలకు రౌండ్‌ 16లో తుర్కియే క్రీడాకారిణి నుర్సిచన్ ఎకిన్సితో అరుణ తన్వార్ పోటీ, రాత్రి 10.40 గంటలకు మెడల్‌ మ్యాచ్‌లు
సైక్లింగ్‌ క్వాలిఫికేషన్‌: సాయంత్రం 4.25 గంటలకు జ్యోతి గదేరియా

11 రోజుల పాటు ఈ పారిస్‌ పారాలింపిక్స్‌ (Paralympics 2024 AT Paris) జరగనుంది. సెప్టెంబరు 8వ తేదీన ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. 22 క్రీడల్లో 4 వేల మందికి పైగా పారా వీరులు పోటీ పడుతుండగా.. భారత్‌ నుంచి 84 మంది అథ్లెట్లు బరిలో దిగారు. తొలిరోజు ట్రాక్‌ సైక్లింగ్‌, టేబుల్‌ టెన్నిస్, తైక్వాండో, పతకాంశాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే పారాలింపిక్స్‌ కోసం 20 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాని నిర్వాహకులు తెలిపారు.

Share post:

లేటెస్ట్