Mana Enadu: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా జరగనున్న మహిళల టీ20 వరల్డ్ కప్(T20 World Cup) కోసం టీమ్ ఇండియా(TeamIndia) జట్టును బీసీసీఐ ప్రకటించింది. మొత్తం పదిహేను మందితో కూడిన జట్టును వెల్లడించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ నాయకత్వంలోనే మరోసారి మెగా టోర్నీలోకి బరిలోకి దిగుతుందని బీసీసీఐ స్పస్టం చేసింది. మరోవైపు వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధానను సెలక్ట్ చేసింది.
ఈ టీమ్‌లో పూజా వస్త్రాకర్, రేణుకా సింగ్ ఠాకూర్‌లు పేసర్లుగా నిలవగా, రాధా యాదవ్, ఆశా శోభన స్పిన్ బౌలింగ్ బాధ్యతలు మోయనున్నారు. సీనియర్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మను జట్టులోకి తీసుకోగా, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌లు ప్రధాన బ్యాట్స్‌మెన్‌లుగా ఎంపికయ్యారు. మరోవైపు గాయాలతో సతమతమవుతున్న వికెట్ కీపర్ యాస్తికా భాటియా, ఆల్ రౌండర్ శ్రేయాంకా పాటిల్ పూర్తి ఫిట్ నెస్ సాధిస్తే జట్టుతోపాటు యూఏఈకి వెళ్తారని బీసీసీఐ పేర్కొంది. ట్రావెలింగ్ రిజర్వు ప్లేయర్లుగా ఉమా శెట్టి, తనూజా కన్వర్, సైమా ఠాకూర్‌లను ఎంపిక చేసింది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు తలపడనున్నాయి.
T20 వరల్డ్‌కప్‌కు టీమ్ఇండియా..
1. హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), 2. స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), 3. షఫాలీ వర్మ, 4. దీప్తి శర్మ, 5. జెమీమా రోడ్రిగ్స్, 6. రిచా ఘోష్, 7. యాస్తికా భాటియా, 8. పుజా వస్త్రాకర్, 9. అరుంధతి రెడ్డి, 10. రేణుకా సింగ్, 11. హేమలత, 12. ఆశా శోభన, 13. రాధా యాదవ్, 14. శ్రేయంకా పాటిల్ 15. సంజనా సంజీవన్.
టీమ్ఇండియా T20WC షెడ్యూల్ ఇలా..
October 4, శుక్రవారం: భారత్ vs న్యూజిలాండ్, దుబాయ్
☛ Oct 6, ఆదివారం: భారత్ vs పాకిస్థాన్, దుబాయ్
☛ Oct 9, బుధవారం: భారత్ vs శ్రీలంక, దుబాయ్
☛ Oct 13, ఆదివారం: భారత్ vs ఆస్ట్రేలియా, షార్జా
☛ Oct 17న ఫస్ట్ సెమీస్ జరగనుండగా, అక్టోబర్ 18న రెండో సెమీస్ జరగనుంది. ఫైనల్ పోరు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా అక్టోబర్ 20న జరగనుంది.
మహిళల T20 ప్రపంచకప్ జట్లు:
* Group-A:
☛ ఆస్ట్రేలియా
☛ భారత్
☛ న్యూజిలాండ్
☛ పాకిస్థాన్
☛ శ్రీలంక
Group-A
☛ దక్షిణాఫ్రికా
☛ ఇంగ్లండ్
☛ వెస్టిండీస్
☛ బంగ్లాదేశ్
☛ స్కాట్లాండ్