వరద బాధితుల కోసం కదిలిన టాలీవుడ్.. భారీగా విరాళాలు

ManaEnadu:తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు (Telugu States Floods) పోటెత్తడంతో తీవ్ర నష్టం జరిగిన విషయం తెలిసిందే. చాలా ప్రాంతాల్లో ప్రజలు వరదల వల్ల భారీగా నష్టపోయారు. ఇంకా చాలా ప్రాంతాలు వరద ముంపు నుంచి కోలుకోలేదు. ఈ నేపథ్యంలో వరద బాధితులకు సాయం చేసేందుకు టాలీవుడ్ కదిలింది. పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాలకు విరాళాలు ప్రకటిస్తూ బాధితులకు అండగా నిలుస్తోంది. ఇప్పటికే నటులు ఎన్టీఆర్, బాలకృష్ణ, విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు వెంకీ అట్లూరి, త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ, వైజయంతీ మూవీస్ తెలుగు రాష్ట్రాలకు విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే. 

తాజాగా సినీ నటుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించారు. తన వంతు సాయంగా ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి (Donations to CM Relief Fund) రూ.కోటి విరాళం ఇవ్వనున్నట్టు వెల్లడించారు. వరద ప్రాంతాల్లో తానూ పర్యటించాలని అనుకున్నానని, కానీ తన వల్ల సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందేమోనని భావిస్తున్నానని పేర్కొన్నారు. ప్రముఖ సినీనటుడు చిరంజీవి (Chiranjeevi Flood Donations) రూ.కోటి విరాళం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు చెరో రూ.50 లక్షల విరాళం ప్రకటిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు.

తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం నందమూరి బాలకృష్ణ (Balakrishna)  తెలంగాణ, ఏపీ సీఎం సహాయనిధికి రూ.50 లక్షల చొప్పున కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు  సినీ నటుడు మహేశ్ బాబు (Mahesh Babu) సైతం రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షలు సీఎం సహాయనిధికి ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వాలు చేపడుతున్న సహాయక చర్యలకు సమష్టిగా మద్దతు ఇద్దామని పిలుపునిచ్చారు. 

మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ (NTR Flood Donations) రూ.50 లక్షల చొప్పున మొత్తం కోటి రూపాయలు, విశ్వక్ సేన్ రూ.10 లక్షలు, వెంకీ అట్లూరి రూ.10 లక్షలు, వైజయంతీ మూవీస్ ఏపీ సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు అందజేసింది. నటి అనన్య నాగళ్ల రూ.2.5 లక్షలు మొత్తం రూ.5 లక్షలు తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి ఇస్తున్నట్లు ప్రకటించింది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *