మన ఈనాడు:రైతు బంధుపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకే రైతు బంధు సాయాన్ని అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. భూమిని సాగు చేసే వారికే రైతు బంధు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Telangana Govt on Rythu Bandhu: రైతు బంధు నిబంధనలపై రేవంత్ (CM Revanth Reddy) సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 5 ఎకరాల లోపు వారికే రైతుబంధు ఇవ్వాలనే ఆలోచలనలో రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) ఉన్నట్లు సమాచారం. గత ఏడాది వానాకాలం లెక్కల ప్రకారం 68.99 లక్షల మందికి రైతు బంధు సాయం అందింది. 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షలు. 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న..రైతుల సంఖ్య 6.65 లక్షలు ఉన్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. వీరి వద్దే మొత్తం 50 లక్షల ఎకరాలు నివేదికలో పేర్కొన్నాయి.
5 ఎకరాల లోపు వారికి రైతుబంధు (Rythu Bandhu Scheme) ఇవ్వాలంటే ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 15 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు అధికారులు. ఇలా చేస్తే ఏడాదికి రూ.7 వేల కోట్లు ఆదా అవుతాయని ప్రభుత్వ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా రైతు బంధు ఇచ్చిందని రేవంత్ సర్కార్ ఆరోపణలు చేసింది. కొండలు, గుట్టలకు కూడా కేసీఆర్ (KCR) రైతు బంధు ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మీడియాతో జరిగిన చిట్ చాట్ లో అన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరి చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు.