సికింద్రాబాద్​ నుంచి బొంతు రామ్మోహన్​..లైన్​ క్లియర్​

మన Enadu: బీఆర్​ఎస్​ అధినేతతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండటంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్​ తొలి మేయర్​గా పనిచేశారు. ఉప్పల్​ టిక్కెట్​ ఆశించినా ఉద్యమ నేతగా తనను మరిచి మరో నాయకుడిగా టిక్కెట్​ అవకాశం ఇవ్వడంతో అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల సీఎం రేవంత్​రెడ్డి సమక్షంలో బొంతు దంపతులు కాంగ్రెస్​లో జాయిన్​ అయ్యారు.

బొంతు రామ్మోహన్​ కాంగ్రెస్​ నుంచి మల్కాజిగిరి టిక్కెట్​ ఆశిస్తున్నారని రాజకీయవర్గాలు భావించాయి.  గ్రేటర్​ హైదరాబాద్​లో బీసీ సామాజిక వర్గంతోపాటు ఉద్యమనాయకుడిగా బొంతు రామ్మోహన్​ బలమైన నేతగా ముద్ర వేసుకున్నారు. ఈక్రమంలోనే అటు బీఆర్​ఎస్​..ఇటు బీజేపీకి గట్టి పోట్టి ఇచ్చే వ్యక్తిగా బొంతుకే కాంగ్రెస్​ పెద్దలు మొగ్గు చూపుతున్నారు.

ఇటీవల బీఆర్​ఎస్​ అధిష్టానంపై ఘాటైన విమర్శలు చేస్తుండటంతో కాంగ్రెస్​ నుంచి ఎంపీ(MP) టిక్కెట్​ కన్ఫర్మ్​ అయినట్లు సమాచారం. దీంతో కేసీఆర్​, కేటీఆర్​పై స్వరం పెంచారు. బీఆర్​ఎస్​ గొంతు కోసిందని బహిరంగంగానే ఆరోపణలు చేశారు. తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తిగా పదువలు కాదు..పరువులు తీసుకోలేమని ఓ మీడియా ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు.

భారతీయ జనతా పార్టీ ఇప్పటికే సికింద్రాబాద్​ నుంచి కిషన్​రెడ్డికి టిక్కెట్​ అధిష్టానం ప్రకటించింది. కిషన్​ రెడ్డిపై పోటీకి బీసీ సామాజిక వర్గం నుంచి మాజీ మేయర్​ బొంతు రామ్మోహన్​ కాంగ్రెస్​ నుంచి పోటీ చేయడమే సరైన అభ్యర్థిగా పార్టీ పెద్దలు భావించారు. ఇప్పటికీ బొంతు పేరును డిల్లీ అధిష్టానానికి పంపించారు. డిల్లీ పెద్దలు బొంతు రామ్మోహన్​కు సికింద్రాబాద్​ నుంచి బరిలో దింపాలని నిర్ణయం తీసుకుంది.

మల్కాజిగిరి నుంచి చంద్రశేఖర్​ , సికింద్రాబాద్​ నుంచి బోంతు రామ్మోహన్​, నల్గొండ నుంచి రఘువీర్​రెడ్డి, నిజమాబాద్​ నుంచి జీవన్​రెడ్డి, భవనగిరి నుంచి కిరణ్​ కుమార్​రెడ్డి పేర్లు ఖారారు అయినట్లు సమాచారం. రేపు అధికారికంగా పేర్లును కాంగ్రెస్​ పెద్దలు ప్రకటించబోతున్నారు.

Share post:

Popular