Mana Enadu: తెలంగాణలోని అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో యాదగిరి గుట్ట ఒకటి. ఈ ఆలయాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. తిరుమల వేంకటేశుడి ఆలయం తరహాలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. అయితే తిరుమల మాదిరి ప్రత్యేక బోర్డు మాత్రం యాదాద్రి దేవస్థానానికి లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth) కీలక నిర్ణయం తీసుకున్నారు. TTD బోర్డు తరహాలో యాదాద్రి బోర్డు(YTDA)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ బోర్డు ఆధ్వర్యంలోనే దేవస్థానానికి సంబంధించిన వ్యహరాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం సూచించారు. అంతేకాదు ఆలయ అభివృద్ధికి సంబధించిన ప్రతి విషయంలోనూ యాదాద్రి బోర్డుదే తుది నిర్ణయంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు ‘స్పీడ్(Speed)’ ప్రాజెక్టులపై సెక్రటేరియట్‌లో ఇవాళ సమీక్షించారు.
మరోవైపు ఎకో, టెంపుల్(Temple) పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. టీటీడీ బోర్డు(TTD Board) తరహాలోనే యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులు వేగవంతం చేయాలన్నారు. ఆలయ పనులు ఎట్టిపరిస్థితుల్లోనూ అర్ధాంతరంగా ఆపవద్దని స్పష్టం చేశారు. YTDA, యాదాద్రి ఆలయానికి సంబంధించి ఎప్పటికప్పుడు పూర్తి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. అటు ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు, సదుపాయాలు, అలానే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సిన చర్యలపై వివరాలు అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
హైదరాబాద్ బయట దాదాపు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో కొత్త జూ పార్క్ ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. వివిధ ప్రాంతాల నుంచి జంతువులు, పక్షులను తీసుకువచ్చి కొత్త జూ పార్క్‌లో ఉంచాలని, అర్బన్ ఫారెస్టీని అభివృద్ధి చేయాలని చెప్పారు. జామ్నగర్లో అనంత్ అంబానీ(Ananth Ambani) 3 వేల ఎకరాల్లో వనతార వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని నెలకొల్పిన విషయాన్ని సీఎం ప్రస్తావించారు. అనంతగిరి ప్రాంతంలో అద్బుతమైన ప్రకృతి అటవీ సంపద ఉందని, అక్కడున్న 200 ఎకరాల ప్రభుత్వ భూములను హెల్త్ టూరిజం అభివృద్ధికి వినియోగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. బెంగుళూరు(Bangalore)లోని జిందాల్ నేచర్ క్యూర్ ఇన్‌స్టిట్యూట్ తరహాలో నేచర్ వెల్ నెస్సెంటర్ అనంతగిరి(Welness Center In Ananthagiri)లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.