Mana Enadu:100 రోజుల పాలన పై ప్రగతి నివేదికను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. ఆ ప్రగతి నివేదికలో మహాలక్ష్మి పథకం , ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, గ్యాస్ సిలిండర్ రాయితీ వంటి కార్యక్రమాలతో కలిపి మొత్తం 5 హామీలను అమలు చేశామని పేర్కొంది.
అందుకు 100 రోజులు అంటూ టార్గెట్ పెట్టుకుంది. కాగా ఈ 100 రోజుల పాలన పై ప్రగతి నివేదికను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది.
అధికారం చేపట్టిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, గ్యాస్ సిలిండర్ రాయితీ కూడా మహాలక్ష్మి పథకంలో భాగమే.
గృహజ్యోతి పథకం కింద జీరో విద్యుత్ బిల్లు కూడా ఇటీవలే అమలులోకి వచ్చింది. రైతు భరోసా ఎలాగూ అమల్లోకి వచ్చింది. చేయూత అనే హామీలో సగం అమల్లోకి వచ్చింది. పెన్షన్ల పెంపుకి కొత్త రేషన్ కార్డులు ముడిపడడంతో అది ఆలస్యమైంది. యువతకు విద్యా భరోసా కార్డు, ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మాణం వంటి హామీలున్న యువ వికాసం ఇంకా అమల్లోకి రాలేదు. హామీలన్ని ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాకపోయినా కూడా ఐదు గ్యారెంటీలు అమలు అయిపోయాయని చెప్పేసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఈ ఆరు గ్యారెంటీలతో పాటు ఇంకా చాలా అభివృద్ది కార్యక్రమాలను అమలు చేశామని కాంగ్రెస్ విడుదల చేసిన ప్రగతి నివేదికలో పేర్కొంది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలు ప్రజలకు తెలిసేలా శ్వేతాపత్రాలు విడుదల చేసి విచారణలు చేపట్టామని , విచారణల కోసం కమిషన్లు ఏర్పాటు చేశామని వివరించింది.