Mana Enadu: సంగారెడ్డి జిల్లా బీడీఎల్ బానూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిఐఎస్ఎఫ్ జవాన్ వెంకటేశ్వర్లు గన్ మిస్ ఫైర్ అయ్యి దుర్మరణం చెందాడు. రాత్రి విధులకు వెళ్లి ఉదయం తిరిగి వస్తుండగా సీఐఎస్ఎఫ్ వాహనంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
బీడీఎల్ బానూరు పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు నంద్యాల జిల్లా అవుకు మండలం జూనూతలకు చెందినవాసిగా తెలిపారు. గతంలో ప్రధాని మోడీ భద్రత టీమ్‌లో 2 ఏళ్లు విధులు నిర్వహించాడు. కాగా.. మృతదేహాన్ని స్వస్థలం అవుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏపీలోని నంద్యాల జిల్లా జూనూతుల గ్రామానికి చెందిన ఆర్మీ జవాను వెంకటేష్(34) సీఐఎస్ఎఫ్లో విధులు నిర్వహిస్తున్నాడు. హైదరాబాదులోని సిఐఎస్ఎఫ్ బెటాలియన్లో విధులు నిర్వర్తిస్తుండేవాడు. విధుల్లో ఉండగా తమ బెటాలియన్కు చెందిన బస్సులో తన వద్ద ఉండే తుపాకీ పేలినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తన వద్ద ఉండే గన్ పేలడంతో తలలోకి బుల్లెట్లు చొచ్చుకుపోవడంతో జవాను అక్కడికక్కడే బస్సులోనే రక్తపు మడుగుల్లో కుప్ప కూలిపోయాడు. బస్సులో వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మృతి చెందిన జవాన్ 13 సంవత్సరాల క్రితం ఉద్యోగంలో చేరాడు. మృతుడికి ఒక కూతురు, కుమార్తె ఉన్నారు.