బిగ్ అలర్ట్.. 5 రోజులపాటు ఆన్‌లైన్‌ పాస్‌పోర్టు సేవలు బంద్‌

ManaEnadu:ప్రస్తుత తరంలో చాలా మంది విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారు. కొంతమంది విదేశీ వీధుల్లో విహరించడం కోసం వెళ్తుంటే.. మరికొందరు అక్కడే సెటిల్ అవ్వడానికి వెళ్తున్నారు. ఇంకొందరేమో చదువు కోసం, ఉద్యోగం కోసం విదేశాలకు పయనమవుతున్నారు. అయితే విదేశాలకు వెళ్లాలంటే పాస్​పోర్టు (Passport) తప్పనిసరి. ఈ నేపథ్యంలో పాస్​పోర్టు సేవలపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఇవాళ రాత్రి (ఆగస్టు 29వతేదీ) నుంచి ఐదు రోజుల పాటు ఆన్‌లైన్ పాస్‌పోర్టు (Online Passport) సేవలకు స్వల్ప అంతరాయం కలగనుందని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. ఆన్‌లైన్ పోర్టల్‌ నిర్వహణ సంబంధిత కార్యకలాపాల కోసం వాటిని నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఐదు రోజుల్లో కొత్త అపాయింట్‌మెంట్లు ఏవీ షెడ్యూల్ చేసే వీలు ఉండదని స్పష్టం చేసింది. ఇప్పటికే చేసుకున్న బుకింగ్‌లు రీషెడ్యూల్ అవుతాయని కంగారు పడాల్సిందేం లేదని వెల్లడించింది.

‘‘సాంకేతిక నిర్వహణ సంబంధిత కార్యకలాపాల దృష్ట్యా పాస్‌పోర్టు సేవా పోర్టల్ (Online Passport Portal) సేవలు గురువారం రాత్రి ఎనిమిది గంటల (ఆగస్టు 29) నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల(సెప్టెబర్ 2) వరకు అందుబాటులో ఉండవు. ఆగస్టు 30వ తేదీకి చేసుకున్న అపాయింట్‌మెంట్లు రీషెడ్యూల్ చేస్తాం. దీనికి సంబంధించిన వివరాలను దరఖాస్తు చేసుకున్న వారికి పంపిస్తాం ’’ అని పాస్‌పోర్టు సేవా పోర్టల్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. దీనిపై భారత విదేశాంగశాఖ స్పందిస్తూ.. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియే అని వెల్లడించింది. దీనివల్ల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రణాళిక ప్రకారమే ముందుకువెళ్తున్నామని తెలిపింది.

పాస్‌పోర్టు సేవా పోర్టల్ ద్వారా కొత్త పాస్‌సోర్టులు లేక వాటి పునరుద్ధరణ కోసం దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రాల్లో అపాయింట్‌మెంట్లు బుక్‌ చేసుకుంటారన్న విషయం తెలిసిందే. అపాయింట్‌మెంట్‌ ఇచ్చిన రోజున వాళ్లు చెప్పిన సమయానికి దరఖాస్తుదారుడు పాస్‌పోర్టు కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు వారు సదరు వ్యక్తికి సంబంధించిన డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేస్తారు. ఆ తర్వాత పోలీసు వెరిఫికేషన్ జరుగుతుంది. ఇక ఆ తర్వాత దరఖాస్తుదారుడి అడ్రస్​కు పాస్​పోర్టు చేరుతుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *