ManaEnadu:ఎమ్మెల్సీలుగా టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ ఇవాళ ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ఇరువురి చేత మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఇద్దరు నేతలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
గవర్నర్ కోటా కింద కొత్తగా శాసనమండలి సభ్యులుగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరామ్, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. గతంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను సిఫార్సు చేస్తూ అప్పటి ప్రభుత్వం గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపగా అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వాటిని తిరస్కరించారు. ఆమె నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. అదేసమయంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరామ్, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ లను నియమించడాన్ని హైకోర్టు కొట్టివేసింది. తాజాగా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధిస్తూ.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాలను ఆపలేమని పేర్కొంది. దీంతో కోదండరాం, అమీర్ అలీఖాన్ లు నేడు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రమాణ స్వీకారం అనంతరం కోదండరాం మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్సీ కావడంతో ఉద్యమకారులు సంతోషంగా ఉన్నారని అన్నారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దీన్ని అదనపు బాధ్యతగా భావిస్తున్నానని చెప్పారు. ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్షల మేరకు పని చేస్తానని స్పష్టం చేశారు.






