Mana Enadu:శ్రావణ మాసం వచ్చేసింది.. ఇకపై జనం ఫంక్షన్లు, వివాహాలు.. గృహ ప్రవేశాలతో బిజీబిజీగా గడిపే టైమ్ రానే వచ్చింది. శ్రావణమాసంలో సాధారణంగా పెళ్లిళ్లు ఎక్కువగా ఉంటాయి. ఇందుకోసం ప్రజలు డీసీఎంలు, కార్లు, ఆటోలు, ప్రైవేటు బస్సుల, స్కూలు బస్సులను అద్దెకు తీసుకోవడం వంటివి చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. పెళ్లిళ్లు.. ఇతర కార్యక్రమాలకు ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకుంటే డిస్కౌంట్ ఇస్తామని వెల్లడించింది. ఈ మేరకు ఓ సర్క్యులర్ రిలీజ్ చేసింది. అయితే ఇది ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా వరకు మాత్రమేనని ఓ నోట్ రిలీజ్ చేసింది. ఇక్కడ ఈ స్కీమ్ సక్సెస్ అయితే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించింది.
ఆఫర్ మిస్ చేసుకోకండి..: TGSRTC
అయితే కొన్ని సార్లు కుటుంబం మొత్తం దూర భారాలు ప్రయాణించాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో హడావుడిగా జర్నీ చేయాలంటే కాస్తంత శ్రమతో కూడుకున్నది. అయితే ఈ బస్ బుకింగ్ వల్ల ఆ శ్రమ తగ్గుతుంది. పెళ్లిళ్లు ఇతర వేడుకలకు బస్ బుక్ చేసుకుంటే 10 పర్సెంట్ డౌస్కౌంట్ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. పైగా ఎలాంటి డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరింది. ఆర్టీసీ బస్ ద్వారా సౌకర్యవంతమైన ప్రయాణం చేయొచ్చని తెలిపింది. హాయిగా రాకపోకలు సాగించొచ్చు కూడా.
రెస్పాన్స్ సూపర్
తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ స్కీమ్‌గా ఉచిత బస్సు పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. మహాలక్ష్మి స్కీమ్‌లో భాగంగా మహిళలకు ఫ్రీ బస్ సదుపాయం అందుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లే సదుపాయం కల్పించడంతో ఊహించని రేంజ్ లో రెస్పాన్స్ వస్తోందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. మరోవైపు ఏపీలోనూ ఫ్రీ బస్ పథకంపై సీఎం చంద్రబాబు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సు పథకంపై అధ్యయనం చేసిన అధికారులు సీఎంకు నివేదిక అందించనున్నారు. సో.. ఏపీలోని మహిళలకూ త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రానుంది.