MLC KAVITHA: అన్నకు రాఖీ కట్టి.. తల్లికి ముద్దుపెట్టి.. ప్రజాక్షేత్రంలో మరింత పోరాడుతానన్న కవిత

Mana Enadu: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్‌పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ(BRS MLC) కవిత హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్(BRS) శ్రేణులు ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. కవిత(KAVITHA)ను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా బస్తీ వాసులు తరలివచ్చారు. ఈ సందర్భంగా సీఎం కవిత.. సీఎం కవిత అంటూ పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు నినాదాలు చేశారు. అక్కడి నుంచి ఆమె భారీ ర్యాలీగా బంజారాహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న కవితకు తల్లి శోభ, కేటీఆర్‌ సతీమణి శైలిమ, ఇతర కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. తల్లి శోభను ఆత్మీయ ఆలింగనం చేసుకొని ఎమ్మెల్సీ కవిత భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె తల్లి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. చాలా రోజుల తర్వాత కవితను చూసిన కటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు.3

 కేటీఆర్ రాఖీ కట్టిన కవిత
ఇదిలా ఉండగా..ఈ నెలలో జరిగిన రాఖీ పండగ సమయంలో కవిత జైలులో ఉండడంతో రాఖీ కట్టలేకపోయారు. దీంతో ఇవాళ కేటీఆర్‌(KTR)కు రాకీ కట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా(Social Media) వేదికగా పంచుకుంది. అటు చెల్లి రాఖీ కట్టడంపై కేటీఆర్ కూడా స్పందించారు. “రాఖీ ఫీలింగ్ తీరిపోయింది” అని ఫేస్‌బుక్‌(Facebook)లో రాసుకొచ్చారు. కవిత ఇంటికి విచ్చేసిన సందర్భంగా ఇంట్లో నెలకొన్న భావోద్వేగ వాతావరణానికి సంబంధించిన వీడియోను ఆయన షేర్ చేశారు.

 నిజం ఎప్పటికైనా గెలుస్తుంది: కవిత
అనంతరం కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయ బద్ధమైన పోరాటం గెలిచిందన్నారు. తాను ఏ తప్పు చేయలేదని, ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తానని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని మరోసారి రుజువైందన్నారు. క్షేత్ర స్థాయిలో మరింత పోరాడుతానని కవిత అన్నారు. నిజం నిలకడ మీద తెలుస్తుందని, ఆ రోజు కోసం పోరాటం చేస్తూనే ఉంటానని ఆమె అన్నారు. ధర్మం గెలుస్తుందని, కేసీఆర్(KCR) నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగే పోరాటాల్లో పాల్గొంటానని ఆమె వెల్లడించారు.

Share post:

లేటెస్ట్