ఆలయ పనులు చేస్తుంటే బయట పడ్డ నిధి..చూసేందుకు పొటెత్తిన జనాలు

మన ఈనాడు:నెల్లూరు జిల్లా గుడ్లూరులో స్థానిక పురాతన శివాలయంలో  జీర్ణోద్ధరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్వతి అమ్మవారు, వినాయకస్వామి ధ్వజ స్తంభాలను తొలగించారు.
ఈ సమయంలో ధ్వజ స్తంభం కింద 405 పురాతన నాణేలు, వినాయకస్వామి ప్రతిమ కింద 105 నాణేలు లభించాయి. ధ్వజస్తంభం కింద లభించిన నాణేలు 1800-1850 కాలం నాటివిగా గుర్తించారు. వినాయకస్వామి ప్రతిమ కింద లభించినవాటికి ఎలాంటి ముద్రలు లేవు. వీటన్నింటిని నిర్వాహకులు స్థానికంగా భద్రపరిచారు.

మళ్లీ ప్రతిష్ఠ సందర్భంగా వీటిని వినియోగించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమ సమయంలో ఇవి బయటపడటం ఆసక్తికరంగా మారింది. పురాతన నాణేలు కావడంతో స్థానికంగా చర్చ జరిగింది. స్థానికులు ఈ నాణేలు చూసేందుకు భారీగా తరలివచ్చారు. ఆలయాలు నిర్మించే సమయంలో వీటిని ధ్వజ స్తంభాల కింద ఉంచి ఉంటారని భావిస్తున్నారు. గతంలో కూడా పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ కార్యక్రమాలు చేపట్టే సమయంలో ఇలాగే నాణేలు బయటపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

Share post:

లేటెస్ట్