Mana Enadu:తెలుగు రాష్ట్రాలను గత రెండ్రోజులు భారీ వర్షాలు (Rains in Telugu States) వణికించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణలో ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, మహబూబాబాద్ జిల్లాలు, ఏపీలో విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. చాలా వరకు ప్రాంతాలు ఇప్పటికీ వరద(Telngana Floods)నీటోలోనే ఉన్నాయి. కూడు గూడు గుడ్డ సర్వం కోల్పోయిన బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అయితే వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వాలతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ, సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు.
ఈ క్రమంలోనే తెలుగు ప్రజలెవరు కష్టాల్లో ఉన్నావారికి సాయం అందించడానికి ఎప్పుడూ ముందుండే నందమూరి నటవారసుడు, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.కోటి విరాళంగా ఇచ్చాడు. ఈ మేరకు తన ఎక్స్‌లో పోస్ట్ పెట్టాడు.
‘నాకు పుట్టిళ్లు లాంటివైన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల కలిగిన వరద బీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలంతా కోలుకోవాలి. నేను దేవుడిని బలంగా ప్రార్థిస్తున్నాను. వరద (AP Floods) విపత్తు నుంచి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకు నావంతు సాయం అందించాలనుకుంటున్నాను. అందుకోసం నావంతుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరొక రూ.50 లక్షలు విరాళం (NTR FLood Donation)గా ప్రకటిస్తున్నాను’ అని ఎన్టీఆర్ తన పోస్టులో రాసుకొచ్చాడు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.
వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి…
— Jr NTR (@tarak9999) September 3, 2024
ఇక మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల కోసం నటుడు విష్వక్‌సేన్(Vishwak Sen) రూ.10 లక్షలు విరాళంగా ప్రకటించాడు. ‘ఈ విపత్తు సమయంలో, రాష్ట్రంలో వరద సహాయక చర్యలకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంల సహాయనిధికి రూ.10 లక్షలు విరాళంగా ఇస్తున్నాను. వరదల వల్ల నష్టపోయిన వారి బాధలను తగ్గించేందుకు నా వంతు సాయం చేసేందుకు ఇది ఓ అడుగు మాత్రమే’ అని సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు.
ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ తెలుగు వైజయంతీ మూవీస్ (vyjayanthi movies) ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.25 లక్షల విరాళం అందించిన విషయం తెలిసిందే. అలాగే, ‘ఆయ్ (Aay)’ చిత్ర బృందం సోమవారం నుంచి వారాంతం వరకూ ఆ సినిమాకి రానున్న వసూళ్లలో నిర్మాత షేర్‌లో 25 శాతాన్ని జనసేన పార్టీ తరఫున విరాళంగా అందజేయనున్నట్లు ప్రకటించింది.






