ManaEnadu:అభిమానులు కష్టాల్లో ఉంటే మేమున్నామంటూ ఎప్పుడూ ముందుకొచ్చే టాలీవుడ్ హీరోలు (Tollywood Heroes).. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు వరదలతో విలవిల్లాడుతుంటే వారికోసం కదం తొక్కుతున్నారు. భారీ వరదల నేపథ్యంలో సర్వం కోల్పోయి అల్లాడుతున్న వారికి అండగా నిలిచేందుకు ఓ అడుగు ముందుకేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ హేమాహేమీలు భారీ ఎత్తున విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఇవాళ ఉదయం ఏపీ సీఎం సహాయనిధి (AP CM Relief Fund)కి కోటి రూపాయల విరాళం అందిస్తున్నట్లు ప్రకటించారు.
అయితే తాజాగా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. మనసున్న మారాజుగా పేరున్న పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వరద బాధితుల కోసం భారీ విరాళం ప్రకటించారు. వరద బాధితుల (Flood Vicitms)కు వ్యక్తిగతంగా ఏకంగా రూ.6 కోట్లు విరాళం అందించనున్నట్లు తెలిపారు. ఇందులో రెండు కోట్ల రూపాయలు రెండు రాష్ట్రాల సీఎంఆర్‌ఎఫ్‌లకు చెరో రూ.కోటి చొప్పున అందించనున్నట్లు చెప్పారు. మరోవైపు ఏపీలోని 400 పంచాయతీలకు రూ.4 కోట్లు విరాళం ప్రకటించిన పవన్ కల్యాణ్.. ఒక్కో పంచాయతీకి రూ.లక్ష చొప్పున విరాళం ప్రకటించారు.
RURAL WATER SUPPLY AND SANITATION DEPARTMENT
Precautionary Measures taken:
➢ Immediately after receiving alert message, a control room is opened at ENC
Office, all SE Offices and all DREO Offices in all Districts.
➢ A WhatsApp group is created with members as ENC, CE’s SE’s,…— Pawan Kalyan (@PawanKalyan) September 2, 2024
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan Floods) మాట్లాడుతూ.. వరద ప్రాంతాల్లో తానూ పర్యటించాలని అనుకున్నానని, కానీ తన వల్ల సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందేమోనని ఆగిపోయానని తెలిపారు. తన పర్యటన సహాయ పడేలా ఉండాలే తప్ప అదనపు భారం కాకూడదని అన్నారు. తాను రాలేదని నిందలు వేయాలని అంటారు తప్ప మరొకటి కాదని చెప్పారు. విపత్తు సమయంలో నిందల కంటే ప్రజాసేవకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
మరోవైపు ‘కల్కి (Kalki 2898 AD)’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వైజయంతి మూవీస్ సంస్థ ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షల విరాళం ప్రకటించగా.. తాజాగా తెలంగాణ సీఎం సహాయనిధికి రూ.20 లక్షల విరాళం అందించనున్నట్లు తెలిపింది. తెలుగు రాష్ట్రాలకు రూ.50 లక్షల చొప్పున అక్కినేని కుటుంబం (Akkineni Family) విరాళం ప్రకటించింది. ఒక్కో రాష్ట్రానికి రూ.50 లక్షల చొప్పున ఏపీ, తెలంగాణ వరద సహాయ కార్యక్రమాలకు రూ.కోటి విరాళం అందించనున్నట్లు నాగార్జున (Nagarjuna) తెలిపారు. ప్రజలకు తక్షణ సహాయం చేరాలని కోరుకుంటున్నామని.. బాధిత ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నామని పేర్కొన్నారు.