Mana Enadu: ప్రణామం.. ప్రణామం.. ప్రణామం..
ప్రభాత సూర్యుడికి ప్రణామం…
ప్రణామం.. ప్రణామం.. ప్రణామం..
సమస్తా ప్రకృతికి ప్రణామం..
అంటూ జనతాగ్యారేజ్(Janatha Garage) సినిమాలోని పాట ద్వారా జూనియర్ ఎన్టీఆర్(Jr Ntr) అడవులు, ప్రకృతి, పొల్యూషన్ గురించి వివరించిన తీరు అమోఘం. భావితరాలు బాగుండాలంటే ప్రకృతిని, అడవులను(Forests) పరిరక్షించుకోవాలని రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ అద్భుతం. హా…ఏంటి సోధీ.. మా బిజీలైఫ్ మాది. సిటీలో ఉండే మాకెందుకు ఈ ప్రకృతి, అడవుల గురించి అనుకుంటున్నారా? అలా అయితే మీ తర్వాతి తరం తీవ్ర ఇబ్బందులు పడటం పక్కా.. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్(Pawan Kalyan) అడవులపై సంచలన కామెంట్స్ చేశారు.
సీఎం సిద్దరామయ్యతో పవన్ భేటీ
తాజాగా కర్ణాటక(Karnataka) వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్య(Siddaramaiah)తో భేటీ అయ్యారు. వన్యప్రాణి, అటవీ సంరక్షణ అంశాలపై ఆయనతో పవన్ చర్చించారు. ప్రధానంగా ఎర్రచందనం(Red sandle) అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. తాజాగా సినిమాల్లో హీరోలు చేస్తున్న పాత్రలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల క్రితం హీరో అనేవాడు అడవులను కాపాడే వాడని, కానీ ఇప్పుడు ఆ అడవుల్లోని చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. మారిన కల్చర్ ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. సినిమా రంగానికి చెందిన వాడిగా ఇలాంటి చిత్రాల్లో నటించడానికి తాను చాలా ఇబ్బంది పడతానని పవన్ తెలిపారు.

గతంలో అడవులపై వచ్చిన సినిమాలెన్నో..
గతంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో సినిమాలు చాలా వచ్చాయి. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ పూర్తిగా ఈ నేపథ్యంలోనే ‘అడవిరాముడు’లాంటి మూవీతో ఇండస్ట్రీ హిట్ సాధించారు. మెగాస్టార్(Megastar) చిరంజీవికి ‘అడవిదొంగ’ రూపంలో బ్లాక్ బస్టర్ దక్కింది. వెంకటేష్(Venkatesh) ‘బొబ్బిలి రాజా’ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాగార్జున ‘అరణ్యకాండ’, బాలకృష్ణ(Balakrishna) ‘భలేవాడివి బాసూ’ డిజాస్టర్లు అయినప్పటికీ వాటి కథాంశం అడవుల్లోనే ఉంటుంది. ఇలా ఎందరో హీరోలు ఈ థీమ్ తో సినిమాలు చేసినవాళ్లే. హాలీవుడ్(Holluwood) నుంచి టార్జాన్, మోగ్లీ(Mowgli) లాంటి మూవీల్లో వన్యప్రాణులు, అడవులను కాపాడుకునే సీన్స్ ఎంతో ఆకట్టుకున్నాయి. అయితే పవన్ తాజా కామెంట్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు మింగుడు పడటం లేదు. పవన్ కావాలనే బన్నీని అంటున్నారని మండిపతున్నారు. అల్లు అర్జున్ పుష్ప, పుష్ప2 సినిమాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే పాత్రల్లో నటిస్తున్నారనే పవన్ ఇలాంటి కామెంట్స్ చేశారని అంటున్నారు.
క్లారిటీ ఇచ్చిన నాదెండ్ల మనోహర్..
ఈ నేపథ్యంలో జనసేన(Janasena) కీలక నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించారు. పవన్ వ్యాఖ్యలపై జరుగుతున్న ప్రచారంపై మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా ఎవరిపైనా కామెంట్స్ చేయరని తెలిపారు. చెట్లు పెంచితే సమాజానికి మంచిది అనేది పవన్ కల్యాణ్ ఆలోచన అని క్లారిటీ ఇచ్చారు. తద్వారా పవన్ చేసిన కామెంట్స్ కేవలం అడవుల నరికీవేతపై మాత్రమేనని, అల్లు అర్జున్ నో, మరొకరినో ఉద్దేశించి కాదని తేల్చి చెప్పారు. మరి చూడాలి. ఈ మామాఅల్లుళ్ల ఫ్యాన్స్ మధ్య రచ్చ ఏ స్థాయికి చేరుతుందో..






