Mana Enadu:ఎనర్జిటిక్ మాస్ హీరో రామ్ పోతినేని(ram pothineni), టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్(puri jagannath) కాంబో తెరకెక్కిన మూవీ డబుల్ ఇస్మార్ట్(Double Ismart). రామ్ నటించిన ఇస్మార్ శంకర్ మూవీకి ఇది సీక్వెల్. ఫస్ట్ పార్ట్‌లో ‘‘నాతో కిరి కిరి అంటే.. పోచమ్మ గుడి ముంగిట పొట్టేల్‌ని కట్టేసినట్టే’’.. దీంతల్లి నా దిమాకేందిరా.. డబుల్ ‘సిమ్ కార్డు’ లెక్కుంది’’ అనే మాస్ మాసాల డైలాగులతో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేశాడు పూరీ. తాజగా ‘‘డబుల్ ఇస్మార్ట్’’తో ప్రేక్షకులను మరోసారి ఊరమాస్ డైలాగ్స్‌తో ఎంటర్‌టైయిన్ చేయడానికి రెడీ అయ్యాడు. ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది.
ఈ ఊరమాస్ సినిమాలో రామ్ సరసన కావ్యా థాపర్(kavya thapar) స్రీన్ చేసుకుంటుండగా.. సంజయ్ దత్(sanjay dutt), బన్ని జె, అలీ, గెటప్ శ్రీను(getup srinu), సాయాజీ షిండే, మకరంద్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇదిలా ఉండగా ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం ప్రమోషన్స్‌ను టీమ్ ఇప్పటికే షురూ చేసింది. ప్రమోషన్స్‌లో భాగంగా హీరో రామ్‌తో గెటప్ శ్రీను, కావ్యా థాపర్ ఓ ఆటోలో వచ్చి చిట్ చాట్ సెషన్ నిర్వహించారు. ఇందులో రామ్, కావ్య పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు.
పూరీ నాకు సెట్ అయే మూవీని ఇచ్చాడు: రామ్
మూవీలో తన పాత్రను డైరెక్టర్ పూరీ లోతుగా పరిశోధించారని చెప్పాడు రామ్. ఇస్మార్ట్ శంకర్‌గా తన పాత్రను మళ్లీ పోషించడం చాలా ఉత్తేజాన్నించిదని తెలిపాడు. “నేను పూరీని గోవా(goa)లో కలిశాను. ఎలాంటి సినిమా చేయాలనే విషయంపై చర్చించినప్పుడు, ఆ పాత్ర మరపురానిదిగా ఉండాలని, దశాబ్దకాలం పాటు గుర్తుండిపోయేలా ఉండాలని చెప్పాను. పూరీ సరిగ్గా అలాంటి మాస్ మూవీలను నాకు గిఫ్ట్‌గా ఇచ్చారని రామ్ తెలిపారు. ‘‘డబుల్ ఇస్మార్ పక్కా డబుల్ డోస్ మూవీ.. మంచీ బిర్యానీ తిన్నట్లు ఉంటది’’ అని చెప్పాడు రామ్.

సీక్వెల్ ఎలా రూపొందిందో రామ్ పోతినేని గెటప్ శ్రీనుతో జరిగిన చిట్‌చాట్‌లో వెల్లడించాడు. ‘నేను పూరీకి ఒకే ఒక్క విషయం చెప్పాను. నాకు అలాంటి మెంటల్ మాస్ పిచ్చి ఉన్న పాత్ర కావాలి, అది గొప్ప స్క్రిప్ట్‌తో కలిపి’ అని అడగ్గానే ఆయన ఓకే చెప్పారని రామ్ తెలిపారు. మరోవైపు ‘కమర్షియల్ సినిమా తీయడం చాలా సవాలుతో కూడుకున్నదని, కానీ అలాంటి మూవీ సక్సెస్ అయితే లభించే ఆనందం అంతాఇంతా కాదన్నాడు హీరో రామ్.
రామ్‌తో డాన్స్ బాగా ఎంజాయ్ చేశా: కావ్య
కావ్య మాట్లాడుతూ..రామ్ అంటే నాకు చాలా గౌరవం..ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పారు. రామ్‌తో డాన్స్ చేయడం నచ్చిందా.. లేక నార్మల్ సీన్స్‌లో చేయడం నచ్చిందా అని అడిగిన ప్రశ్నకు తనకు రామ్‌తో అన్ని సీన్లు నచ్చాయని బదులిచ్చిందీ ముంబై బ్యూటీ. ఈ మూవీ ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నానని, ప్రతిదీ నా వ్యక్తిగతమనుకొని చేశానని చెప్పింది కావ్య. ఈ సినిమాలో ఓ ఫైటింగ్ సీన్ చాలా ఆకట్టుకుందన్నారు.







