Mr.Bachchan: మిస్టర్ బచ్చన్ ట్రైలర్ వచ్చేసింది.. డైలాగ్స్ కేక

Mana Enadu :మాస్ మహారాజా రవితేజ(Ravi teja), డైరెక్టర్ హరీశ్ శంకర్(Harish shankar) కాంబోలో మూవీ వస్తుందంటే మినిమమ్ గ్యారంటీ హిట్ పక్కా. రవితేజ ఎనర్జీ, డైలాగ్ డెలివరీకి ఓ రకంగా చెప్పాలంటే ఫ్యాన్స్‌కి పూనకాలు వచ్చేస్తాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘‘మిస్టర్ బచ్చన్’’(Mister Bacchan). మిరపకాయ్ లాంటి మాస్ మసాలా మూవీ తర్వాత వీరి కాంబోలో వస్తున్న సెకెండ్ మూవీ ఇది. గద్దలకొండ గణేష్ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న హరీశ్ శంకర్ దాదాపు 5ఏళ్ల గ్యాప్ తర్వాత మిస్టర్ బచ్చన్ సినిమాతో వస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri borse) హీరోయిన్‌గా నటించారు. జగపతిబాబు(jagapathi babu) కీ రోల్ పోషించారు. ఇటీవల ఈ సినిమా టీజర్ ఇప్పటికే అభిమానుల్లో అంచనాలు పెంచయగా.. కాసేపటి క్రితం మూవీ టీమ్ అఫీషియల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. 

యాటిట్యూడ్ ఇంటి పేరు లాంటిది..

టీజర్‌(Teaser)లో ‘సక్సెస్, ఫెయిల్యూర్స్ ఇంటికొచ్చే చుట్టాల్లాంటివి. వస్తుంటాయ్, పోతుంటాయ్. యాటిట్యూడ్ ఇంటి పేరు లాంటిది.. అది పోయేదాకా మనతోనే ఉంటుంది’ అనే డైలాగ్ ఫ్యాన్స్‌కు తెగ నచ్చేంది. తాజాగా రిలీజైన ట్రైలర్‌(Trailer)లో డైలాగ్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. ‘‘ఇండియన్ ఆర్మీ ఎంత పవర్ ఫుల్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా అంతే పవర్ ఫుల్ అని నిరూపిస్తా’ అనే డైలాగ్ సూపర్‌గా ఉంది. 

 ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారిగా

 ‘సరిహద్దు కాపాడేవాడే సైనికుడు కాదు.. సంపద కాపాడేవాడు కూడా సైనికుడే’ అనే డైలాగ్‌తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఎక్కడో మారుమూల గ్రామంలో సరదాగా తిరిగే కుర్రాడు ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారిగా పని చేయడం.. ఒక బిగ్ షాట్ మీద రైడ్ చేయాల్సి రావడం వంటి ఎలిమెంట్స్‌తో సినిమా ఎలా ఉంటుందో అనేది ట్రైలర్‌లో చూపించారు హరీశ్. రవితేజ, భాగ్యశ్రీ బోర్సే లుక్స్, డైలాగ్స్, మ్యూజిక్, ఫైట్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ సైతం మెప్పించగా తాజాగా రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది.

Share post:

లేటెస్ట్