Mana Eenadu: తమిళ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ (ది గోట్, The GOAT)’. డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో విజయ్ సరసన మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) హీరోయిన్‌గా నటిస్తుండగా.. స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా(Prabhu Deva), అజ్మల్ అమీర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై కల్పతి ఎస్. అగోరం, కల్పతి ఎస్. గణేశ్, కల్పతి ఎస్. సురేశ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ప్రచార పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో విజయ్ కోసం ప్రత్యేకంగా ‘డీ-ఏజింగ్ టెక్నాలజీ’ వాడి పాతికేళ్ల కుర్రాడిగా చూపించనున్నారు. అమెరికాలోని లాస్‌ఏంజెలిస్‌లోని స్టూడియో నిపుణులు ఈ విజువల్ ఎఫెక్ట్స్ పనులు పూర్తి చేశారు
అభిమానుల్లో భారీ హోప్స్
అయితే ఈ చిత్రం ట్రైలర్ కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైమ్‌లో మూవీ మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు. ‘‘మేము మీ కోసం ఓ అద్భుతమైన ట్రైలర్‌ను సిద్ధం చేస్తున్నాం. కాబట్టి దయచేసి ప్రశాంతంగా ఉండండి. మాకు కొంత టైమ్ ఇవ్వండి. త్వరలోనే మీకు సరైన అప్డేట్ ఇస్తాం’’ అని ప్రొడ్యూసర్ ట్వీట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ‘‘ది గోట్.. ట్రైలర్ కమింగ్ సూన్’’ అనే న్యూస్ ట్రెండ్ అవుతోంది. కాగా వినాయక చవితి ఫెస్టివల్ స్పెషల్‌గా ఈ మూవీ వచ్చే సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానుంది. దీంతో ఈ చిత్రంపై విజయ్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
మరో సినిమా తర్వాత నటనకు గుడ్ బై
మరోవైపు ‘ది గోట్’ సినిమా తర్వాత దళపతి విజయ్ మరో సినిమా చేయనున్నారు. ఆ తర్వాత యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పనున్నారు. ఇదే విషయాన్ని విజయంగా స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇకపై తాను పూర్తిగా రాజకీయాలకే అంకితమవుతానని విజయ్ ఇటీవల వెల్లడించారు. తమిళనాడులో 2026లో అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) జరగనున్నాయి. ఈ క్రమంలోనే విజయ్ లేటెస్ట్ మూవీ విషయంలో నిర్మాతలు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘ది గోట్’ సినిమాను తొలిరోజు తమిళనాడులోని అన్ని థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.






