Mana Enadu: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల ప్రేమ గురించే చర్చ జరుగుతోంది. గురువారం రోజున వీరి నిశ్చితార్థం జరగగా.. త్వరలో ఈ జంట పెళ్లిపీటలు ఎక్కనుంది. అయితే నాగచైతన్యకు ఇది రెెడో పెళ్లి. గతంలో చై.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ జంట విడాకులు తీసుకుంది. ఇక చై శోభితతో మళ్లీ ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలో మొదటి భార్యకు విడాకులు ఇచ్చి మళ్లీ ప్రేమలో పడి రెండో పెళ్లి చేసుకున్న హీరోల గురించి చర్చ నడుస్తోంది. మరి ఆ హీరోలు ఎవరో చూద్దామా..?
నాగచైతన్య : సమంతతో 4 ఏళ్ల వివాహ బంధానికి 2021లో గుడ్ బై చెప్పారు నాగచైతన్య. ఆ తర్వాత ఆయన శోభితను ప్రేమించి ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. త్వరలోనే వివాహ బంధంతో ఈ జంట ఒక్కటి కానుంది.
ఆమీర్ ఖాన్ : బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ తన మొదటి భార్య రీనా దత్తాతో 16 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పి ఆ తర్వాత ఫిల్మ్ మేకర్ కిరణ్ రావ్ను వివాహం చేసుకున్నారు. ఈ జంట కూడా 2021లో విడిపోయిన విషయం తెలిసిందే.
హృతిక్ రోషన్ : గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ సుస్సానే ఖాన్ను 2000 సంవత్సరంలో వివాహం చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరబ్బాయిలు కూడా ఉన్నారు. 2014లో ల హృతిక్ -సుస్సానే విడిపోయారు. ఇప్పుడు ఈ స్టార్ రో యంగ్ బ్యూటీ సబా ఆజాద్ తో ప్రేమలో పడ్డాడు. ఇక సుస్సానే కూడా అర్సల్ గోనీతో ప్రేమలో ఉంది.
సైఫ్ అలీఖాన్ : పటౌడీ ఖాన్ సైఫ్ అలీ ఖాన్ కూడా తన మొదటి భార్య, నటి అమృతా సింగ్ కు విడాకులిచ్చాడు. ఈ జంటకు సారా అలీఖాన్, ఇబ్రహీం ఖాన్ పిల్లలు. ఆ తర్వాత 2007లో ఓ సినిమా షూటింగ్ సమయంలో సైఫ్, కరీనాతో ప్రేమలో పడ్డాడు. 2012లో పెళ్లి చేసుకుని తైమూర్ అలీఖాన్, జై అనే ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు.
ఫర్హాన్ అక్తర్ : బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ 3 ఏళ్ల డేటింగ్ తర్వాత హెయిర్ స్టైలిస్ట్ అధునా భబానీని పెళ్లాడి 16 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు చెప్పాడు. ఆ తర్వాత షిబానీ దండేకర్తో 4 ఏళ్లు ప్రేమాయణం నడిపి 2022లో రెండో పెళ్లాడాడు.
అర్జున రాంపాల్ : బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ తన 20 ఏళ్ల వైవాహిక బంధానికి 2018లో స్వస్తి పలికి.. భార్య మెహర్ జెసియా నుంచి విడిపోయాడు. ఈ తర్వాత మోడల్ గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్తో డేటింగ్ చేసి ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాడు.