ManaEnadu:యూట్యూబ్.. ప్రస్తుత తరంలో యువత ఎక్కువగా వాడే సోషల్ ప్లాట్ ఫామ్. వీడియోలు చూడాలన్నా.. కంటెంట్ క్రియేట్ చేయాలన్నా.. యూట్యూబ్ ను ఆశ్రయిస్తుంటారు. ఇక వంటల నుంచి.. రాకెట్ తయారూ చేయడమెలాగో కూడా యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటోంది నేటి తరం. అలా ఈ కంపెనీ అందిస్తున్న పలు సర్వీసులు పొందేందుకు సబ్ స్క్రిప్షిన్ ఫీను చెల్లిస్తూ తమకు కావాల్సిన వీడియోలు చూస్తున్నారు.
అయితే తాజాగా భారతీయ యూట్యూబ్ యూజర్లకు ఈ కంపెనీ షాక్ ఇచ్చింది. ఒక్కసారిగా యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధరలను భారీగా పెంచింది. ఫ్యామిలీ, స్టూడెంట్, వ్యక్తిగత ప్లాన్లు, రెన్యువల్ సబ్‌స్క్రిప్షన్ ధరల్ని 58 శాతం పెంచి యూజర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. మరి అందుబాటులోకి వచ్చిన కొత్త ధరలు ఎలా ఉన్నాయో చూద్దామా..
యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ అంటే ఏంటి?:
ఈ సబ్ స్క్రిప్షన్ పొందిన వారు యాడ్స్ లేకుండా కంటెంట్ వీక్షించొచ్చు. యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకొనేందుకు యూట్యూబ్ 30 సెకండ్ల పాటు అన్‌స్కిప్పబుల్ యాడ్స్ ఆప్షన్ను చాలాకాలం క్రితమే తీసుకు రాగా.. ప్రీమియం సబ్‌స్క్రైబర్లను పెంచుకోవటంలో భాగంగా ఏటా ప్రీమియం ధరలను పెంచుతూ, తగ్గుతూ వస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ ధరలను భారీగా పెంచింది.
పెంచిన కొత్త ధరలు :
వ్యక్తిగత ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధర: యూట్యూబ్ వ్యక్తిగత ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధర నెలకు రూ.149. పాత ధర రూ.129గా ఉండేది.
ఫ్యామిలీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధర: ఈ ధరను ప్రస్తుతం రూ.299కి పెంచింది. గతంలో రూ.189గా ఉండేది.
స్టూడెంట్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధర: ప్రీమియం స్టూడెంట్ ప్లాన్ ధర రూ.79 నుంచి రూ.89కి పెరిగింది.
వ్యక్తిగత ప్రీపెయిడ్ నెలవారి ప్లాన్ ధర: వ్యక్తిగత ప్రీపెయిడ్ ప్లాన్ ధర నెలకు రూ.139గా ఉండగా రూ.159కి పెంచింది.
వ్యక్తిగత త్రైమాసిక ప్లాన్ ధర: వ్యక్తిగత త్రైమాసిక ప్లాన్ ధరను రూ.459కి సవరించింది. పాత ధర రూ.399.
వ్యక్తిగత వార్షిక ప్లాన్ ధర: రూ.1290 ఉన్న ఈ ధరను రూ.1490కి పెంచింది.








