congress government:పేదలకు ఇళ్లపై రేవంత్​ సర్కారు ఫోకస్..ధరణి పేరులో మార్పు?

మన ఈనాడు: పేదలకు ఇళ్ల కేటాయింపుపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేలా కార్యాచరణకు దిగింది.దీని మీద గృహనిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ స్థాపించిన దగ్గర నుంచీ వరుసపెట్టి ఆరు గ్యారెంటీలను అమలు చేయడమే కాక ఇళ్ళ కేటాయింపు, రైతు బంధు పంపిణీ లాంటి విషయాల మీద కూడా ఫోకస్ పెట్టింది. వీటి మీద సీఎం రేవంత్ రెడ్డితో పాటూ గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇళ్ళ నిర్మాణానికి 3, 4 నమూనాలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

గృహ నిర్మాణ సంస్థ పునరుద్ధరణ చేయాలని చెప్పారు. ప్రస్తుతం గృహనిర్మాణ శాఖ..రోడ్లు, భవనాల శాఖలో భాగంగా ఉంది. దీన్ని వేరేగా ఒక శాఖ చేయాలా అన్న దాని మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు దీని కోసం ఇతర శాఖల నుంచి సిబ్బందిని తీసుకోవాలని కూడా నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్లపై త్వరలోనే సీఎం రేవంత్‌ సమీక్ష నిర్వహించనున్నారని సీఎం కార్యాలయం చెప్పింది. సీఎం సమీక్ష తర్వాత ఇండ్ల నిర్మాణానికి విధివిధానాలు ఖరారు చేయనున్నారు.

మరోవైపు తెలంగాణలో రైతుబంధు పంపిణీ కొనసాగుతోంది. సోమవారం నుంచి నిధుల జమ మొదలైంది. మొదటగా ఎకరాలోపు భూమున్న రైతుల ఖాతాల్లో డబ్బుల జమ చేస్తున్నారు. ఇప్పటిదాకా 22లక్షల మంది రైతుల అకౌంట్లలో రూ.640కోట్ల జమ అయిందని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ఈసారికి పాత పద్ధతిలోనే రైతుబంధును జమ చేస్తున్నామని తెలిపింది. ఒకటిరెండు రోజుల్లో రైతుబంధుపై సర్క్యులర్ విడుదల చేస్తామని చెప్పింది. అది వచ్చాక కొత్తవారికి స్కీం వర్తింపు ఉంటుందని వివరించింది.

ఇక ధరణి పోర్టల్‌పై కాసేపట్లో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీనికి మంత్రి పొంగులేటి, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కమిటీ వేసే ఆలోచనలో ఉందని సమాచారం. ధరణిలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని అందుకే దాని స్థానంలో కొత్త పోర్టల్ తెస్తామని కాంగ్రెస్ చెబుతోంది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ధరణి పోర్టల్‌లో మార్పులు చేస్తామని తెలిపింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *