Mana Enadu: ఐపీఎల్, ఆ వెంటనే టీ20 వరల్డ్ కప్.. ఆ తర్వాత శ్రీలంక టూర్.. ఇదీ అంతర్జాతీయ క్రికెట్‌లో టీమ్ఇండియా(TeamIndia) ఆడిన మ్యాచ్‌ల తీరు. దాదాపు ఏడాది కాలంగా భారత్ రెడ్ బాల్ క్రికెట్(Cricket) ఆడలేదు. మరోవైపు త్వరలోనే భారత్ బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో టెస్టు సిరీస్‌లు ఆడనుంది. అయితే అందుకు సమయం ఎక్కువగా ఉండటంతో భారత ఆటగాళ్లు వచ్చే నెలలో ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ(Duleep Trophy)లో బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. కానీ స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ(Virat Kohli), కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), స్పీడ్ గన్ జస్‌ప్రీత్(Jaspret Bumrah) బుమ్రా మాత్రం రెస్టు తీసుకుంటున్నారు. ఈ ట్రోఫీకి BCCI కూడా వారిని సెలక్ట్ చేయలేదు. అయితే భారత్ క్రికెట్లో ఎంత పెద్ద ప్లేయర్ అయినా సరే ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాల్సిందేనని పలువురు భారత మాజీ ప్లేయర్లు అంటున్నారు. విశ్రాంతి పేరుతో దేశవాళీ మ్యాచులకు దూరంగా ఉండటం సరికాదని మాజీ ప్లేయర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు.
ఆ ముగ్గురికీ తగినంత రెస్ట్ దొరికింది: సంజయ్
ఇందుకు తగ్గట్లుగానే ఈ ఏడాది దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో భారత జట్టుకు రెగ్యులర్‌గా ఆడే ఆటగాళ్లు అందరూ బరిలోకి దిగాలని బీసీసీఐ ఆదేశాలు ఇచ్చింది. అయితే, దులీప్ ట్రోఫీకి రోహిత్ శర్మ, కోహ్లీ, బుమ్రాను సెలెక్టర్లు రెస్ట్ ఇవ్వడంపై భారత మాజీ ప్లేయర్ సంజయ్ మంజ్రేకర్(Sanjay Manjrakar) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ ముగ్గురిని కూడా ఎంపిక చేయాల్సిందని ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈ ముగ్గురు ప్లేయర్లకు తగినంత రెస్ట్ దొరికిందని చెప్పారు. ఇంతటితో ఆగకుండా గత ఐదేళ్లలో ఇండియా ఆడిన మ్యాచుల వివరాలను మెన్షన్ చేశాడు. భారత్ 5 ఏళ్లలో 249 అంతర్జాతీయ మ్యాచ్‍లు ఆడింది. వీటిలో రోహిత్ శర్మ 59 శాతం, విరాట్ 61 శాతం, బుమ్రా 34 శాతం ఆడారని, వీరికి సరిపడా విశ్రాంతి లభించినట్లు తనకు అనిపిస్తోందని మంజ్రేకర్ ట్వీట్ చేశారు.
సీనియర్ ప్లేయర్లను గౌరవించుకోవాలి: జైషా
మరోవైపు టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్(Sunil Gavskar) కూడా బీసీసీఐ తీరును తప్పుబట్టారు. జట్టులో కొంతమంది ఆటగాళ్ల పట్ల బోర్డు అతిగా స్పందింస్తోందని విమర్శించారు. దులీప్ ట్రోఫీలో రోహిత్ శర్మ, కోహ్లీ, బుమ్రా ఆడాల్సిందని అన్నారు. ఎక్కువ కాలం ఆటకు దూరం ఉంటే మళ్లీ లయ అందుకునేందుకు టైమ్ పట్టే అవకాశం ఉంటుందని తెలిపారు. మరోవైపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్లను దేశవాళీ ట్రోఫీ ఆడాలని బలవంతపెట్టకూడదని బీసీసీఐ కార్యదర్శి Jai Sha ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అలాంటి ప్లేయర్లను గౌరవంగా చూసుకోవాలని చెప్పారు. కాగా దులీప్ ట్రోఫీ టోర్నీ సెప్టెంబర్ 5న మొదలుకానుంది.

భారత్, బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఇదే..
☞ SEP 19న ఫస్ట్ టెస్ట్, చెపాక్ ఎంఏ చిదంబరం స్టేడియం
☞ SEP 27న రెండో టెస్ట్, కాన్పూర్
* వన్డే టీ20 సిరీస్ షెడ్యూల్ ఇలా..
☞ OCT 6న తొలి టీ20, గ్వాలియర్
☞ OCT 9న రెండో టీ20, ఢిల్లీ
☞ OCT 12న మూడో టీ20, హైదరాబాద్








