GHMC| గ్రేటర్​ సీటీ కార్పొరేషన్​గా హైదరాబాద్​..

కొత్త హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్‌ దిశగా రేవంత్‌ సర్కార్‌ అడుగులేస్తోంది. శివారు ప్రాంతాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాల్టీల విలీనం చేయాలని చూస్తోంది. ఇదే జరిగితే భౌగోళిక విస్తరణలో హైదరాబాద్ దేశంలోనే అతిపెద్దదిగా మారుతుంది. ఈ ప్రతిపాదనపై పనిచేయాలని MAUDని సీఎం ఆదేశించారు.

హైదరాబాద్‌(Hyderabad) నగరాన్ని మరింత విస్తరించాలని కాంగ్రెస్‌(Congress) భావిస్తోంది. శివారు ప్రాంతాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాల్టీల విలీనం చేయాలని చూస్తోంది. శివారు ప్రాంతాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాల్టీల విలీనం దిశగా అడుగులేస్తోంది. దీనిపై ఓ అధ్యయనం చేయాలని అధికారులను సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. 7 కార్పొరేషన్లు, 30 మున్సిపాల్టీలను విలీనం చేసే అవకాశం కనిపిస్తోంది. అన్నింటినీ కలిపి గ్రేటర్‌ సిటీ కార్పొరేషన్‌(Greater City Corporation) ఏర్పాటు చేసే ఛాన్స్‌ ఉంది. లేదంటే నాలుగు కార్పొరేషన్లుగా విభజన జరగవచ్చు. ప్రస్తుతం మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల పదవీ కాలం ముగిసిన తర్వాతే విలీన ప్రక్రియ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పదవీకాలం ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారులను నియమిస్తారని సమాచారం. వచ్చే ఏడాది GHMC తో పాటు ఇతర పౌర సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి.

GHMC పట్టణ సముదాయం 625 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(HMDA) దాని పరిధిలో 7,300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. హెచ్‌ఎండీఏ పరిధిలో బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, బండ్లగూడ జాగీర్, బడంగ్‌పేట్, మీర్‌పేట్, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మణికొండ, నార్సింగి, తెల్లాపూర్ లాంటి 30 మున్సిపాలిటీలు ఉన్నాయి. కొత్త గ్రేటర్ సిటీ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ భౌగోళిక విస్తరణ దేశంలోనే అతిపెద్దదిగా మారుతుంది. ఈ ప్రతిపాదనపై పనిచేయాలని MAUD ని రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆదేశించినట్లు సమాచారం. వివిధ నగరాల నమూనాలను, ముఖ్యంగా మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీని అధ్యయనం చేయాలని చెప్పినట్టుగా తెలుస్తోంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *