Congress Schemes: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి చెందిన మరో రెండు పథకాలను నేడు ప్రారంభించబోతున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీ పథకాల్లో మరో రెండు పథకాలు నేటి నుంచి అమలు కానున్నాయి.
సచివాలయంలో జరిగే కార్యక్రమంలో సీఎం వీటిని లాంఛనంగా ప్రారంభించనున్నారు. నేటి నుంచి తెలంగాణలో మరో రెండు హామీలు అమలు కానున్నాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఫారా ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని భావిస్తున్నారు.
గృహజ్యోతి పథకం ద్వారా రేషన్‌కార్డుదారులకు ప్రతినెలా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించే మహాలక్ష్మి మహాలక్ష్మి పథకం ప్రారంభిస్తామన్నారు.వర్చువల్ గా ప్రియాంక గాంధీ ప్రసంగించనున్నారు.
చేవెళ్ల సభను పెద్దఎత్తున మహిళలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని ప్రారంభించాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర సచివాలయంలో రూ.500 వంటగ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇవాళ సాయంత్రం చేవెళ్లలో జరిగే బహిరంగ సభలో పథకాలను ప్రారంభించనున్నారు.