మన ఈనాడుః గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య చేసుకున్నఘటన తెలంగాణ రాజకీయాల్లో అగ్గి రాజేసింది. టిపిసిసి అధ్యక్షుడు బతుకమ్మ సంబురాలపై వీడియోలు చేసే కవితకు..ప్రవళిక ఆత్మహత్య చేసుకున్న మృత్యు ఘోష వినిపించలేదంటూ ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేస్తూ ట్విట్ చేశారు. గ్రూప్ పరీక్షల నిర్వహణ అవకతవకలతో బతుకు భారమై, భవిత ఆగమై ఆత్మహత్య చేసుకున్న ప్రవల్లిక ఆత్మ ఘోష వినబడటం లేదా!?, ఆడబిడ్డల హక్కులు మీ దృష్టిలో రాజకీయ అంగడి సరుకేనా అంటూ… రాజకీయ నినాదాలు తప్ప మానవీయ ఎజెండాలు కాదు.’ అంటూ ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి ట్వీట్ పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. బతుకమ్మను కించపరచడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం విచారకరం… ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రావద్దన్నారు.
గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య వ్యవహారంలో టీసీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత నిప్పులు చెరిగారు. రేవంత్ ఆవేదన బూటకం… కాంగ్రెస్ ఆందోళన నాటకం అంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వం విడుదల చేసిన ప్రతీ నోటిఫికేషన్ ను అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు చేసిందంటూ ధ్వజమెత్తారు. గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అసెంబ్లీలో మాట్లాడిన వీడియోను కవిత ట్వీట్ చేశారు.