Road Accident: ప్రయాగ్‌రాజ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌(UP)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. మహాకుంభమేళా(Maha Kumbhamela)కు భక్తులతో వెళుతున్న బస్సు(Bus)ను బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 19 మంది గాయపడ్డారు. కాగా వీరంతా ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లోని కోర్బా జిల్లా నుంచి UP ప్రయాగ్ రాజ్‌లోని త్రివేణీసంగమం(Triveni Sangamam)లో స్నానం ఆచరించేందుకు వెళ్తున్నారు. అయితే ప్రయాగ్ రాజ్-మిర్జాపూర్‌ రోడ్డు(Prayagraj-Mirzapur highway)పై బొలెరో వాహనం బస్సును ఢీకొట్టింది. మృతదేహాలను పోస్టుమార్టం(Postmortem of dead bodies) కోసం స్వరూప్ రాణి మెడికల్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

ఘటనపై సీఎం యోగి ఆరా

అటు సమాచారం అందుకున్న యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్(CM Yogi Adityanath) ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. కాగా ఇటీవల మహాకుంభ మేళాలో మౌని అమావాస్య(Mouni Amavasya) సందర్భంగా జరిగిన తొక్కిసలా ఘటనలో 30 మంది మరణించగా.. 60 మందికిపైగా గాయపడిన సంగతి తెలిసిందే.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *