
తెలంగాణ(Telangana)లో ఎండలు సుర్రుమంటున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని(Students Health) దృష్టిలో పెట్టుకుని హాఫ్ డే స్కూళ్లు(Halfday Schools) నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15నుంచే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఒంటిపూట నిర్వహించాలని సూచించింది. ఈమేరకు స్కూల్ యాజమాన్యాలు, ప్రిన్సిపల్స్‌కు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లు ఉదయం 8గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం 12:30 గంటలకు క్లోజ్ చేయాలని ఆదేశించింది.
వారికి మధ్యాహ్నం పూట క్లాసులు
ఇదిలా ఉండగా రాష్ట్రంలోని స్కూళ్లకు వచ్చే ఏప్రిల్ 20 నుంచి సమ్మర్ హాలిడేస్(Summer Holidays) ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాలు(Exam Centers) ఉన్న స్కూళ్లు మధ్యాహ్నం పూట క్లాసులు నిర్వహించాలని సూచించింది. ఈమేరకు పాఠశాలల్లో ఏర్పాట్లు చేసుకోవాలంటూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసింది.