INDW vs NZW: సత్తా చాటిన డెబ్యూ ప్లేయర్.. తొలి ODIలో భారత్ గెలుపు

Mana Enadu: భారత ఉమెన్స్ క్రికెట్‌ టీమ్(Indian Women’s Cricket Team) అదరగొట్టింది. ఆల్‌రౌండర్‌ దీప్తిశర్మ (41, 1/35) ఆల్‌రౌండ్‌ షోతో అహ్మదాబాద్‌(Ahmedabad) వేదికగా న్యూజిలాండ్‌(New Zealand)తో జరిగిన తొలి వన్డేలో టీమ్‌ఇండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో ఆ జట్టుతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌(3 match ODI series)లో భారత్ 1-0తో లీడ్ సాధించింది. మోదీ స్టేడియంలో జరిగిన మొదటి ODIలో మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 44.3 ఓవర్లలో 227 పరుగులు చేసింది. ఛేదనలో కివీస్ 40.4 ఓవర్లలో 168 రన్స్‌కే కుప్పకూలింది.

 కొత్త ప్లేయర్లు అదరగొట్టారు

భారత జట్టు బ్యాటింగ్‌లో యంగ్ ప్లేయర్ తేజల్‌ హసబ్నిస్‌ (42), దీప్తి, యస్తికా భాటియా (37) రాణించారు. జెమీమా (35), షెఫాలి వర్మ (33) కీలక ఇన్నింగ్స్ ఆడారు. కాగా ఈ మ్యాచ్‌కు హర్మన్ ప్రీత్(Harman Preet) దూరమడంతో కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న స్మృతి మంధాన (5) విఫలమైంది. కివీస్ బౌలర్లలో అమేలియా కేర్‌ (4/42), జెస్‌ కెర్‌ (3/49) భారత్‌ను కట్టడి చేశారు. ఛేదనలో న్యూజిలాండ్‌ తడబడింది. ఎడమచేతి స్పిన్నర్‌ రాధ యాదవ్‌ (3/35), అరంగేట్ర పేసర్‌ సైమా ఠాకోర్‌ (2/26) ధాటికి 40.4 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌట్ అయింది. కాగా రెండో ODI ఇదే వేదికపై ఆదివారం జరుగుతుంది.

కాగా ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌(UAE) వేదికగా జరిగిన ఐసీసీ ఉమెన్స్ T20 ప్రపంచ కప్ 2024 (ICC WT20 WC 2024)ను న్యూజిలాండ్ ఎగురేసుకుపోయిన సంగతి తెలిసిందే. ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఉమెన్ క్రికెట్ టీమ్ (New Zealand), సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించింది. దీంతో న్యూజిలాండ్ చరిత్రలోనే తొలిసారిగా టీ20 వరల్డ్ కప్‌ గెలుచుకుని రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ టోర్నీలో భారత్ గ్రూప్ దశలోనే ఇంటి దారి పట్టిన విషయం తెలిసిందే.

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *