ముఖాలు చూపించకుండా సినిమా.. ‘రా రాజా’ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ యంగ్ హీరో సుగీ విజయ్, మౌనిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రా రాజా (Raa Raja)’. బి. శివప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇీవలే రిలీజ్ అయి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ రిలీజ్ చేశారు. మార్చి 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద నిర్మిస్తున్న ఈ సినిమాను ముఖాలు చూపించకుండా తెరకెక్కిస్తూ కొత్త ప్రయోగం చేశారు మేకర్స్. ‘రా రాజా ’చిత్రానికి బూర్లే హరి ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, కిట్టు లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

రిలీజ్ డేట్ పోస్టర్ ను రిలీజ్ చేసిన తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. ‘రా రాజా మూవీ టైటిల్‌ను గమనిస్తే ఏదో ప్రేమ కథలా అనిపిస్తుంది. కానీ ఈ చిత్రంలో ఓ ముఖం కూడా కనిపించదు. అసలు మొహాలు చూపించకుండా సినిమా తీసి దర్శకుడు శివ ప్రసాద్ ధైర్యం చేశాడు. డ్యూయెల్ అని స్పీల్ బర్గ్ తీసిన చిత్రంలోనూ మొహం కనిపించదు. అలానే ఈ చిత్రంలోనూ మొహాలు కనిపించవని అంటున్నారు. ఇది చాలా పెద్ద ప్రయోగం. ఇది కనుక సక్సెస్ అయితే ఇండస్ట్రీ మొత్తం మారిపోతుంది. అసలు హీరోలు, స్టార్లతో పని లేకుండా అద్భుతమైన చిత్రాలు, ప్రయోగాలు చేయొచ్చని అంతా ముందుకు వస్తారు. అని తమ్మారెడ్డి అన్నారు.

‘మా ట్రైలర్‌ను చూసి, రిలీజ్ డేట్ పోస్టర్‌ను రిలీజ్ చేసి, అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి థాంక్స్. మా చిత్రంలో ఆర్టిసుల మొహాలు కనిపించవు. కథ, కథనమే ముఖ్యం అని మేం ఈ మూవీని తీశాం. ఇది ఒక ప్రయోగం. మా ప్రయోగాన్ని అందరూ ఆదరిస్తారని, అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని డైరెక్టర్ శివప్రసాద్ అన్నారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *