సినిమా ఇండస్ర్టీలోకి వచ్చిన తక్కువ సమయంలలోనే టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ స్టేటస్ ను సంపాదించాడు. అయితే, ఊహించని విధంగా 2019 సెప్టెంబర్ 25వ తేదీన హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. వేణు మాధవ్ మరణం ఆయన అభిమానులకే కాకుండా ఇండస్ట్రీకే విషాదాన్ని నింపింది.
కోదాడ నుంచి సాధారణ మిమిక్రీ ఆర్టిస్ట్ గా జీవితాన్ని స్టార్ట్ చేశాడు వేణుమాధవ్. షార్ట్ టైమ్ లోనే కమెడియన్ గా ఎదిగాడు. టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ స్టేటస్ ను సంపాదించాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్‌గా హవాను చూపించాడు. ఒకప్పుడు తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి తనదైన శైలిలో కామెడీ చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. అయితే ఎంతో జీవితం ఉన్న వేణుమాధవ్ పలు రకాల అనారోగ్య సమస్యల వల్ల అతి చిన్న వయసులోనే మరణించి అందరికి దురమయ్యాడు.
స్టార్ కమెడియన్ వేణు మాధవ్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన సొంత ఊరు కోదాడలో వేణు మాధవ్ వాల్ పెయింటింగ్ వేశారు. ఈ వాల్ ఆర్ట్ చూసిన వేణు మాధవ్ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. అంతే కాకుండా వేణు మాధవ్ వాల్ పెయింటింగ్ వేయించినందుకు మంత్రి కేటీఆర్ కు హార్ట్ ఫుల్ గా థ్యాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.