
ఇటీవల మంచు ఫ్యామిలీ(Manchu Family) ప్రజల్లో బాగా చర్చనీయాంశంగా మారింది. మంచు మనోజ్(Manchu Manoj), విష్ణు(Manchu Vishnu), మోహన్ బాబు(Manchu Mohan Babu)ల గొడవతో ప్రతి ఒక్కరికీ వీరి గురించి తెలిసింది. అయితే కుటుంబ కలహాల(Family strife) నుంచి ఇప్పుడిప్పుడే వారు బయటపడుతున్నట్లు తెలుస్తోంది. పైగా ఎవరి సినిమా పనుల్లో వారు బిజీగా ఉండటంతో కాస్త ఈ మధ్య మీడియా దృష్టి వారి మీదనుంచి దూరంగా మళ్లింది. మంచు మనోజ్ భైరవం(Bhairavam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించగా.. తాజాగా కన్నప్ప(Kannappa) మూవీతో అతడి అన్న మంచు విష్ణు త్వరలోనే అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలోనే కన్నప్ప టీమ్ నిన్న ప్రీరిలీజ్ ఈవెంటు(Kannappa Pre-release event)ను గ్రాండ్‌గా నిర్వహించింది. అయితే, ఈ సినిమా షూటింగ్ సమయంలో మోహన్ బాబు మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మోహన్ మాట్లాడిన వీడియో వైరల్
మంచు మనోజ్ (Manchu manoj), విష్ణు ఇద్దరు ఆస్తుల గురించి గత కొద్ది కాలంగా గొడవలు పడుతున్న విషయం తెలిసిందే. ఇక దీనికి ఆజ్యం పోసేలా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ‘కన్నప్ప’(Kannappa) సినిమా షూటింగ్ చేస్తున్న న్యూజిలాండ్(New Zealand)లోని 7 వేల ఎకరాలు మోహన్ బాబు(Mohanbabu) కొన్నట్లు చెప్పారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా, ఈ విషయంపై కమెడియన్ బ్రహ్మాజీ(Brahmmaji) ఓ ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చారు.
Mohanbabu Mass 😂😂😂#JustforGags pic.twitter.com/Nbb2y053R6
— V@ndeM@taR@m (@patriotatwork99) June 22, 2025
ఆయన కామెడీని సీరియస్‌గా తీసుకోకండి
‘‘నేను శ్రీ మోహన్ బాబు(Mohan Babu), విష్ణు మంచుతో పోస్ట్(Post) చేసిన ఆ వీడియో చాలా సరదాగా ఉంది. మేము ఎప్పటిలాగే నవ్వుకుంటూ ఉన్నాం. మేము న్యూజిలాండ్‌లో 7000 ఎకరాలు కొనడం, పర్వతాలను కూడా సొంతం చేసుకోవడం గురించి జోక్ చేశాం. మోహన్ బాబు పూర్తి హాస్య రూపంలో ఉన్నారు. నేను ఎప్పటిలాగే వారిని ఇబ్బంది పెట్టాను. కానీ అకస్మాత్తుగా ప్రజలు అది నిజమని నమ్మడం ప్రారంభించారు. న్యూజిలాండ్‌లో 7000 ఎకరాలు కొనడం అంత సులభం అయితే, నేను అక్కడ షూటింగ్ చేసేవాడిని కదా. నిజానికి న్యూజిలాండ్‌లో ఎవరూ భూమిని కొనుగోలు చేయలేదు. ఇదంతా సరదాగా చేసిందే. న్యూజిలాండ్ పౌరులు భూమిని అమ్మరు. దయచేసి ఆయన కామెడీని అంత సీరియస్‌గా తీసుకోకండి’’ అని రాసుకొచ్చారు. ఇక ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు పలు విమర్శలు చేస్తున్నారు.
“Guys, come on! 😄”
That video I posted with Mr. Mohan Babu garu and Vishnu Manchu was pure fun — just a bunch of us having a good laugh like we always do.
We joked about buying 7000 acres in New Zealand, even owning the mountains! Vishnu played along, Mohan Babu garu was in…— Brahmaji (@actorbrahmaji) June 22, 2025