భర్తను అమ్మెసింది ఓ భార్య

శుభలగ్నం సినిమా కథ చాలా మందికి తెలిసే ఉంటుంది . ఆ సినిమాలో డబ్బు కోసం భార్య.. తన భర్తను అమ్మేస్తుంది. ఆ సమయంలో.. “మంగళ సూత్రం అంగడి సరుకా… కొనగలవా చెయ్యి జారాకా” అనే ఫంక్తులతో వచ్చిన ఒక పాట ఇప్పటికీ వన్ ఆఫ్ ది తెలుగు సూపర్​ హిట్ సాంగ్​. తాజాగా నిజజీవితంలోకూడా అలాంటి ఘటన కర్ణాటకలో జరిగింది.

స్థానికంగా ఉండే ఒక మహిళతో తన భర్త సన్నిహితంగా ఉన్నాడని ఆ గృహిణి తెలుసుకుది. వారిద్దరూ ఏకాంతంగా గడుపుతుండగా పట్టుకుని అందిరిముందే కడిగేసింది. గొడవ పంచాయితీ వరకు వెళ్లడంతో భర్తకు సన్నిహితంగా ఉన్న మహిళ నీ భర్త రూ.5లక్షలు తన వద్ద తీసుకున్నాడని ఆ మొత్తం చెల్లించాలని డిమాండ్ చేసింది. డబ్బులు చెల్లించాకే భర్తను తీసుకెళ్లాలని తెలిపింది. అలాంటి భర్త నాకేమీ వద్దని, నాకే రూ.5 లక్షల మనోవర్తి ఇచ్చి, అతన్ని నువ్వే ఉంచుకోవాలని ఆ ఇల్లాలు చెప్పింది. ఆ నగదు ఇచ్చేందుకు ఒక నెల సమయం ఇస్తే ఆ నగదు ఇస్తానని ఆ మహిళ చెప్పింది. అందుకు ఆ గృహిణి అంగీకరించింది. వీరిద్దరూ చేసుకున్న రాజీ ఒప్పందం చూసి పంచాయితీ ప్రతినిధులు, గ్రామస్థులు ఆశ్చర్యపోయారు.

Share post:

లేటెస్ట్