సినిమా అంటే ఇదీ..! నటీనటులే లేరు కానీ గూస్ బంప్స్ పక్కా.. థియేటర్స్‌లో నరసింహుడి ఉగ్రరూపమే..

సినిమా అంటే స్టార్ హీరోహీరోయిన్లు ఉండాలి అనే రోజులు ఎప్పుడో పోయాయి. మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ వస్తోంది. అలాంటి కేటగిరీలోనే ఉంది మహా అవతార్ నరసింహ. కాకపోతే ఈ మూవీ ఇంకా డిఫరెంట్. ఈ సినిమాలో నటీనటులు లేనేలేరు.. ఒక్క నటుడు కూడా నటించలేదు. కానీ థియేటర్స్‌కి వచ్చిన ఆడియన్స్ మాత్రం ఊగిపోతున్నారు. బిగ్ స్క్రీన్ పై రసింహుడి ఉగ్రరూపం చూసి పూనకాలెత్తిపోతున్నారు. జులై 25న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో సత్తా చాటుతోంది. అన్ని వర్గాల ఆడియన్స్ ఈ సినిమా కోసం థియేటర్ల వైపు పరుగులు పెడుతున్నారు.

హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో వచ్చిన మహావతార్ నరసింహ మూవీ కేవలం యానిమేషన్ తోనే రూపొందింది. భారీ VFXతో విజువల్ వండర్ గా ఈ సినిమాను తీర్చిదిద్దారు. భక్త ప్రహ్లాదుడి కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం.. ఆడియన్స్ ని భక్తి పారవశ్యంలో ముంచెత్తడమే గాక, విజువల్ ఫీస్ట్ గా మారింది. మరీ ముఖ్యంగా పిల్లలు, యూత్ అయితే ఈ సినిమా చూసి ఖుషీ ఖుషీ అవుతున్నారు. మళ్ళీ మళ్ళీ చూడలనిపిస్తోంది అంటున్నారు. ఇక థియేటర్స్ లో ఈలలు, గోలలు అయితే మామూలు కాదండీ. నటీనటులే లేకున్నా ఇలా కేకలు పెట్టిస్తుందంటే ఈ సినిమాలో ఎంత స్టఫ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

నిజానికి ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయలేదు. అసలు మహావతార్ నరసింహ మూవీ అనేది ఒకరి థియేటర్లలో విడుదలైంది అని చాలామందికి తెలియదు కూడా. అలాంటి పరిస్థితుల్లో ఈ మూవీ చూసిన కొందరు ప్రేక్షకులు ఇచ్చిన ఫీడ్ బ్యాక్, అలా అలా స్ప్రెడ్ అయిన మౌత్ టాక్‌తో అన్ని ఏరియాల్లో ఈ సినిమా హంగామా నడుస్తోంది. వయసుతో సంబంధం లేకుండా థియేటర్ లో ఎంటర్ అయిన ప్రతి ఒక్కరూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. VFX వర్క్స్, క్లైమాక్స్ ఫైట్ సీన్స్ చూస్తుంటే ఒక్క క్షణం కూడా కన్నార్పలేరు. ఇప్పటి తరం మిస్ కాకుండా తప్పక చూడాల్సిన సినిమా అని మూవీ క్రిటిక్స్ కూడా ఈ ‘మహావతార్ నరసింహా’ సినిమాపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. సో.. ఇంకెందుకు ఆలస్యం వెంటనే థియేటర్లకు వెళ్లి చూసేయండి మరి.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *