
గత వారం ‘కోర్ట్ (Court)’ సినిమా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ వారం కూడా తమ అదృష్టం పరీక్షించుకునేందుకు, ప్రేక్షకులను మైమరిపించేందుకు చిన్న సినిమాలు రెడీగా ఉన్నాయి. ఈ వారం కూడా థియేటర్లలో సిన్న సిత్రాలే సందడి చేయనున్నారు. గతవారం కోర్ట్ సినిమాతో నిర్మాతగా థియేటర్ కు వచ్చిన నాని ఈ వారం ఆయన నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం (Yevade Subramanyam) చిత్రంతో మరోసారి థియేటర్లో సందడి చేయనున్నాడు. మరోవైపు అలరించే సినిమాలతో, అద్భుతమైన వెబ్ సిరీస్ లతో ఓటీటీలు కూడా రెడీ అయ్యాయి. మరి ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే సినిమా సంగతులు చూద్దామా..?
చిన్న సినిమాల హవా
స్టార్ హీరోల సినిమాలు వాయిదాల మీద వాయిదాలు పడుతుండటం చిన్న సినిమాలకు కలిసి వస్తోంది. గత రెండు మూడు వారాల నుంచి థియేటర్లలో చిన్న సినిమాల హవాయే సాగుతోంది. ఈ వారం కూడా థియేటర్లలో చిన్న సినిమాలే రిలీజ్ కానున్నాయి. ఆది సాయికుమార్ (Aadi Saikumar), అవికా గోర్ నటించిన షణ్ముఖ, సప్తగిరి పెళ్లి కాని ప్రసాద్ (Pelli Kani Prasad), అనగనగా ఆస్ట్రేలియాలో, ఆర్టిస్ట్, ది సస్పెక్ట్, వంటి చిన్న సినిమాలతో పాటు నేచురల్ స్టార్ నాని మూవీ ఎవడే సుబ్రహ్మణ్యం, ప్రభాస్ సలార్ (Prabhas Salaar) వరకు ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం.
థియేటర్లో విడుదల కానున్న సినిమాలివే
- షణ్ముఖ – మార్చి 21
- పెళ్లి కాని ప్రసాద్ – మార్చి 21
- టుక్ టుక్ – మార్చి 21
- అనగనగా ఆస్ట్రేలియాలో – మార్చి 21
- ఆర్టిస్ట్ – మార్చి 21
- ది సస్పెక్ట్ – మార్చి 21
- కిస్ కిస్ కిస్సిక్ – మార్చి 21
- ఎవడే సుబ్రహ్మణ్యం (రీ- రిలీజ్) – మార్చి 21
- సలార్: సీజ్‌ఫైర్ (రీ – రిలీజ్ )- మార్చి 21
ఓటీటీ సినిమాలు/సిరీస్ లు ఇవే
ఆహా
- బ్రహ్మాఆనందం: మార్చి 20 (గోల్డ్ సబ్‌స్క్రిప్షన్: మార్చి 19)
నెట్‌ఫ్లిక్స్
- ఆఫీసర్ ఆన్ డ్యూటీ: మార్చి 20
- ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్ (వెబ్‌సిరీస్): మార్చి 20
- బెట్ యువర్ లైఫ్ (వెబ్‌సిరీస్): మార్చి 20
- లిటిల్ సైబీరియా: మార్చి 21
- విమెన్ ఆఫ్ ది డెడ్ 2 (వెబ్‌సిరీస్): మార్చి 19