
అగ్రరాజ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)కు షాక్ తగిలింది. అమెరికాకు రెండో సారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు నుంచే వినూత్న నిర్ణయాలతో ఆశ్చర్యపరుస్తున్న ట్రంప్.. తాజాగా తీసుకున్న మరో నిర్ణయం అమెరికన్ల(Americans) ఆగ్రహానికి కారణమైంది. దీంతో ట్రంప్, మస్క్(Musk) నిర్ణయాల పట్ల అమెరికన్లు గుర్రుగా ఉన్నారు. వీరిద్దరి నిర్ణయాల వల్ల దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం(Inflation, Unemployment) పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా ట్రంప్‌కు వ్యతిరేకంగా దాదాపు 50 రాష్ట్రాల నుంచి ప్రజలు ఈ ఆందోళనలలో పాల్గొన్నారు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష(Presidency) బాధ్యతలు స్వీకరించాక జరిగిన అతిపెద్ద నిరసన కార్యక్రమం ఇదేనని అక్కడి రాజకీయ వర్గాలు తెలిపాయి. ముందుచూపు లేకుండా ట్రంప్, మస్క్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల వాణిజ్య యుద్ధాలు(Trade wars) జరుగుతాయని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
1,200పైగా ప్రదేశాలలో నిరసన ర్యాలీ
ప్రభుత్వ ఉద్యోగుల(Employees)ను తొలగిస్తూ మస్క్ తీసుకున్న నిర్ణయంపైనా నిరసన వ్యక్తం చేశారు. ‘హ్యాండ్స్ ఆఫ్!’ పేరుతో దేశవ్యాప్తంగా 1,200 పైగా ప్రదేశాలలో నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ‘‘Trump Go Back’, ‘Hands of Democracy’, ‘Musk Wasn’t Elected’’ వంటి నినాదాలతో వాషింగ్టన్ DC, న్యూయార్క్, చికాగో, మయామీ వంటి నగరాల్లోని స్టేట్ క్యాపిటల్ భవనాలు, ఫెడరల్ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేస్తున్నారు. అధ్యక్షుడు ట్రంప్ అమలు చేస్తున్న వలస వ్యతిరేక విధానాలు, టారిఫ్(Tariff)ల విధింపు, మస్క్ చేతిలో ప్రభుత్వ డేటా గోప్యతపై ప్రజలు తమ ఆందోళనలను కేంద్రీకరించారు. అటు ప్రపంచ దేశాలతోనూ ట్రంప్ వైఖరీ చాలా కఠినంగా ఉండటంతో మెజార్టీ దేశాలు ఆయనపై గుర్రుగా ఉన్నాయి.
🇺🇲Thousands of protesters in the US protested against Trump and Musk — Reuters.
Thousands of people took to the streets of Washington and other US cities in about 1,200 demonstrations, which were expected to be the largest day of protest against President Donald pic.twitter.com/BWuX1h8ePQ
— Tracey SBU Fella 🇬🇧🇺🇦 #NAFO (@trajaykay) April 5, 2025