
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైస్సార్సీపీ కీలక నేత వల్లభనేని వంశీ (vallabhaneni vamsi)కి బిగ్ షాక్ తగిలింది. విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు వంశీని మూడ్రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతించింది. వెన్ను నొప్పి కారణంగా ఇబ్బంది పడుతున్నానంటూ వంశీ దాఖలు చేసిన పిటిషన్ పై స్పందిస్తూ.. వంశీకి బెడ్, వెస్ట్రన్ టాయిలెట్ ఏర్పాటు చేయాలని జైలు అధికారులను ఆదేశించింది.
విజయవాడ పరిధిలో విచారణ
వంశీని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేయాలని ఎస్సీ, ఎస్టీ కోర్టు పోలీసులకు సూచనలు జారీ చేసింది. ఈ మూడ్రోజుల పాటు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం కచ్చితంగా అతడికి మెడికల్ టెస్టులు చేయాలని చెప్పింది. విజయవాడ పరిధిలోనే కస్టడీ (Police Custody)లోకి తీసుకుని విచారణ చేయాలని ఆదేశించింది. న్యాయవాది సమక్షంలోనే ఈ విచారణ కొనసాగించాలని పేర్కొనింది. మరోవైపు సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీతో పాటు అరెస్టైన ఏ7, ఏ8 ఇద్దరినీ కూడా విచారించడానికి కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది.