
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్నికలకు నగారా మోగింది. ఇటీవలే టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల (MLA Quota MLC Elections) షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. ఏపీ, తెలంగాణలో ఐదుగురు చొప్పున మొత్తం 10 మంది పదవీకాలం ముగియనుంది.
మార్చి 29వ తేదీ నాటికి ఏపీలో యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, పి.అశోక్ బాబు, తిరుమల నాయుడు, దువ్వారపు రామారావు పదవీ కాలం ముగియనుంది. ఇక తెలంగాణలో మహమూద్ అలీ, సత్యవతి రాఠోడ్, శేరి సుభాష్‌రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్ హాసన్ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది.
ముఖ్యమైన తేదీలు
ఎన్నికల నోటిఫికేషన్ జారీ: మార్చి 3
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం: మార్చి 10
నామినేషన్ల పరిశీలన: మార్చి 11
నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 13
పోలింగ్: మార్చి 20 (ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు)
ఓట్ల లెక్కింపు: మార్చి 20 (పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి)