
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(AP Assembly Budget Sessions) రేపటికి వాయిదా పడ్డాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్(Governor Justice Abdul Nazeer) ప్రసంగించారు. YCP సభ్యుల నిరసనల మధ్యే గవర్నర్ ప్రసంగం కొనసాగింది. కాసేపు నిరసన కార్యక్రాన్ని చేపట్టిన వైసీపీ సభ్యులు ఆ తర్వాత సభ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగం కొనసాగింది. ప్రసంగం ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు(CM Chandrababu), అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్ గవర్నర్‌ను వాహనం వరకు తీసుకెళ్లి వీడ్కోలు పలికారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన బీఏసీ మీటింగ్
కాగా అనర్హత వేటు(Disqualification) తప్పించుకునేందుకు అసెంబ్లీకి వచ్చిన జగన్(YS Jagan) బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన 11 నిమిషాలకే YCP సభ్యులతో కలిసి బయటకు వచ్చేశారు. పైగా ఉన్న కొద్దిసేపు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుని, సభలో గందరగోళం సృష్టించేందుకు యత్నించారు. సభలో వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని ఆ పార్టీ సభ్యుల నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా సభ వాయిదా పడిన వెంటనే CM చంద్రబాబు అధ్యక్షతన బీఏసీ(Business Advisory Committee) సమావేశం ప్రారంభమయింది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై అజెండాను నిర్ణయించనున్నారు. రేపు సభలో రాష్ట్ర బడ్జెట్ 2025-26 ప్రవేశపెట్టనున్నారు.