
గత కొంతకాలంగా పెరుగుతున్న బంగారం ధరలు(Gold Rates) నేడు కూడా స్వల్పంగా పెరిగాయి. నేడు దేశరాజధాని ఢిల్లీ(Delhi)లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి రేటు గురువారంతో పోలిస్తే రూ.10 మేర తగ్గి రూ. 88,200కు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర కూడా అదే స్థాయిలో పెరిగి రూ.80,860 దగ్గరకు చేరుకుంది. కాగా ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇదే ఒరవడి కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో అస్థిరత(Volatility in the market) కారణంగా పెట్టుబడిదారులు(Investers) బంగారంవైపు మొగ్గు చూపుతుండటంతో ధరలకు రెక్కలు వస్తున్నాయని నిపుణులు అంటున్నారు.
కాగా ఇవాళ హైదరాబాద్(Hyderabad)లో గోల్డ్ రేట్స్ ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి రేటు రూ.88,050 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,710వద్ద కొనసాగుతోంది. ఇక కేజీ వెండి(Silver) ధర రూ.1,07,900గా ఉంది. అటు విజయవాడలోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక రూపీ వ్యాల్యూ(Rupee Value) సైతం రోజురోజుకీ క్షీణిస్తోంది. ఇవాళ ఒక అమెరికన్ డాలర్(US Dallar)కు రూ.86.79గా రూపీ వ్యాల్యూ ఉంది.