Gold Price: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధర

పసిడి ప్రియులకు కాస్త ఉపశమనం కలగనున్నట్లు తెలుస్తోంది. గత 15 రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న పుత్తడి ధరలు(Gold Rate) త్వరలోనే తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బులియన్ మార్కెట్లో(bullion market) పసిడి రేట్లు వెనక్కి తగ్గాయి. స్పాట్ గోల్డ్ రేటు ఏకంగా ఔన్సుకు 2930 డాలర్ల స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం 2885 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అంటే ఒక్క రోజులోనే ఏకంగా 45 డాలర్లకుపైగా బంగారం ధర పతనమైంది. దీంతో మన దేశంలోనూ ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు మార్కెట్ విశ్లేషకులు(Market analysts) అభిప్రాయపడుతున్నారు.

కాస్త ఉపశమనం..

అయితే అంతర్జాతీయ మార్కెట్లో(international markets) రేట్లు తగ్గడంతో ఇవాళ (ఫిబ్రవరి 12) హైదరాబాద్(HYD) మార్కెట్లో ప్రస్తుతం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.700 తగ్గి రూ. 79,400కు చేరింది. ఇదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం(Pure Gold) ధర రూ.700 తగ్గడంతో రూ. 86,670 వద్ద ట్రేడవుతోంది. ఇక కేజీ వెండి ధరపై రూ. 100 తగ్గి ప్రస్తుతం రూ.99,400 వద్ద కొనసాగుతోంది.

దేశ రాజధానిలో రేటు ఎక్కువే

మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో చూస్తే బంగారం ధరలు.. హైదరాబాద్‌తో పోలిస్తే ఇంకాస్త ఎక్కువే ఉన్నాయి. ఢిల్లీలో ప్రస్తుతం 22 క్యారెట్స్ 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 79,550గా ఉంది. ఇదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 86,820 వద్ద కొనసాగుతోంది. స్థానిక పన్ను రేట్లు సహా ఇతర అంశాల కారణంగా బంగారం, వెండి(Silver Price) ధరలు ఆయా ప్రాంతాల వారీగా స్వల్ప మార్పులు ఉండొచ్చు. ఇక ఇవాళ రూపీ వ్యాల్యూ(Rupee Value) ఒక US డాలర్‌కు రూ.87.43గా ఉంది.

Related Posts

Fish Venkat: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ (Fish Venkat) శుక్రవారం (జులై 18) రాత్రి కన్నుమూశారు. 53 ఏళ్ల ఆయన అసలు పేరు మంగిలంపల్లి వెంకటేశ్. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం(serious illness)తో…

IBPS PO 2025 Notification: డిగ్రీ అర్హతతో IBPSలో భారీ నోటిఫికేషన్.. 5,208 పోస్టులు భర్తీ! ఇలా అప్లై చేయండి!

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) మరియు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా రెండు కీలక నోటిఫికేషన్ల( Notifications)ను విడుదల చేశాయి. బ్యాంకింగ్, ఇంజనీరింగ్ రంగాల్లో ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం. IBPS PO/MT…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *